జగన్ కామెంట్స్ కు టీడీపీ ఘాటు కౌంటర్-పిన్నెల్లికి కోడికత్తి శ్రీనుతో పోలిక..!
ఏపీలో ఎన్నికల సందర్భంగా ఈవీఎం ధ్వంసం, దాడుల ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ ఇవాళ ములాఖత్ లో పరామర్శించారు.ఈ సందర్భంగా జగన్ కూటమి సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై జగన్ మండిపడ్డారు. ఇదే మాదిరి దాడులు కొనసాగితే రియాక్షన్ కూడా అంతే స్థాయిలో ఉంటుందంటూ జగన్ చేసిన హెచ్చరికలపై టీడీపీ నేతలు స్పందించారు.
ముందు వైసీపీ ఉంటుందో..లేదో చూసుకో జగన్ రెడ్డీ అంటూ నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈవీఎం పగలగొట్టి, సీఐపై హత్యాయత్నం చేస్తే తప్పు లేదా అని జగన్ ను ఆయన ప్రశ్నించారు. పాపాలు చేశారు కాబట్టే ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నారన్నారు. పిన్నెల్లి పరామర్శ కోసం నెల్లూరుకు వచ్చిన జగన్ హితబోధలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఆయన అన్నీ డోర్ డెలివరీ చేశారంట, అవును నిజమే..డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని కూడా డోర్ డెలివరీ చేశారంటూ ఎద్దేవా చేశారు.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కేసులో చిన్నరాయి కారణంగా సీఐ తల పగిలిందంట అంటూ సోమిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. ఈయన మీద చిన్నగులకరాయి పడిందని విజయవాడ యువకుడిని నెల్లూరులో ఇదే జైలులో పెట్టిన విషయం మాత్రం గుర్తులేదా అని నిలదీసారు. భుజంపై బఠాని గింజంత గాయం లేకపోయినా కోడికత్తి కేసులో శ్రీనుపై కనికరం లేకుండా ఐదేళ్లు జైలులో పెట్టించారన్నారు. కులం చూడలేదంట, మతం చూడలేదంట. పార్టీ చూడలేదంట, ఇది కూడా నిజమేనన్నారు.
ఒక రామోజీరావు, ఒక అమర్ రాజా ఫ్యాక్టరీ, సంగం డెయిరీ, రఘురామకృష్ణంరాజు, అచ్చెన్నాయుడు చివరకు చంద్రబాబు నాయుడిని కూడా వదిలిపెట్టకుండా కక్షసాధింపుల్లో అందరినీ సమానంగా చూశాడని సోమిరెడ్డి ఆరోపించారు. ఈవీఎం పగలకొడితే తప్పేమిటని ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి అనడం చాలా దురదృష్టకర పరిణామం అన్నారు. ప్రజాస్వామ్యం. చట్టం, ఎన్నికల కమిషన్ పై జగన్మోహన్ రెడ్డికి కనీస గౌరవం లేదన్నారు.
చంద్రబాబు నాయుడు అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టడం కాదు, మీరు చేసిన పాపాలకు వచ్చే ఎన్నికల వరకు వైసీపీ ఉంటుందో..లేదో చూసుకోవాలన్నారు. మంచి చేసి ఉంటే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారో ఆలోచించుకోవాలన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అనేక దుర్మార్గాలకు పాల్పడ్డారు..కాబట్టే ఈ రోజు పాపాలకు ప్రాయశ్చితం అనుభవిస్తున్నారన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications