మోడీకి చంద్రబాబు 'తలాఖ్': కాంగ్రెస్‌ వెంట టిడిపి, దేనికి సంకేతం...

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఎన్డీఎ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ట్రిపుల్ తలాక్ బిల్లుపై కాంగ్రెసుతో చేతులు కలిపింది.

  ట్రిపుల్ తలాక్‌కు తిప్పలే!

  ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించే అంశంపై కాంగ్రెసు వైఖరికి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించిదంి.. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుండి విముక్తి కలిగించేందుకు ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలనే డిమాండ్‌తో టిడిపి ఏకీభవిస్తోంది.

   బిల్లుపై ఆజాద్‌కు రమేష్ లేఖ

  బిల్లుపై ఆజాద్‌కు రమేష్ లేఖ

  ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటికి పంపించాలనే డిమాండ్‌తో కాంగ్రెసుతో కలిసి పోరాడతామని రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌తో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌కు తెలియజేశారు. చంద్రబాబు అనుమతి లేకుండా సిఎం రమేష్ అంత పనిచేస్తారని అనుకోవడానికి లేదు.

   ఇలా కూడా టిడిపి చేసింది

  ఇలా కూడా టిడిపి చేసింది

  రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు ఆనంద్ శర్మ బుధవారం రాజ్యసభలో ప్రతిపాదించిన ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని ప్రతిపాదిస్తూ కమిటీ సభ్యుల పేర్లను కూడా సూచించారు. తాను సూచించిన కమిటీలో ప్రతిపక్షం తరపున టిడిపిసభ్యుల జాబితాలో చేరి సంచలనం సృష్టించింది. అందులో సిఎం రమేష్ పేరు ఉంది.

   ఆజాద్‌ను రమేష్ కలిసి..

  ఆజాద్‌ను రమేష్ కలిసి..

  సి.ఎం.రమేష్ మంగళవారం మధ్యాహ్నం రాజ్యసభ ఇన్నర్ లాబీలో గులాం నబీ ఆజాద్‌ను కలిసి ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని తమ పార్టీ కూడా డిమాండ్ చేస్తోందని, ఈ లక్ష్య సాధనకోసం ప్రతిపక్షంతో కలిసి పోరాడతామని చెప్పారు.

   ప్రభుత్వంలో ఉంటూ ఇలా.

  ప్రభుత్వంలో ఉంటూ ఇలా.

  ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉంది. టిడిపికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అధికార బిజెపికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో తెలుగుదేశం ప్రతిపక్షంతో చేతులు కలపటం చర్చనీయాంశంగా మారింది.

   మోడీ, చంద్రబాబు మధ్య దూరమేనా...

  మోడీ, చంద్రబాబు మధ్య దూరమేనా...

  ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయటం ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య పెరుగుతున్న దూరానికి సంకేతంగా భావిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  NDA partner Telugu Desam party was supporting Congress stand on Triple Talaq bill.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి