వివేకా హంతకులకు ప్రాణహాని ? మొద్దు శీనులా-కడప జైలర్ ను మార్చాలని సీబీఐకి టీడీపీ లేఖ
వైఎస్ వివేకా హత్య కేసులో తాజాగా వెలుగుచూస్తున్న అంశాలు కలకలం రేపుతుండగానే ఏపీ ప్రభుత్వం ఆయన హంతకులు ఉన్న కడప సెంట్రల్ జైలుకు జైలర్ గా వివాదాస్పద పోలీసు అధికారి వరుణారెడ్డిని బదిలీ చేయడంపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. గతంలో అనంతపురం జైల్లో వరుణారెడ్డి హయాంలోనే పరిటాల రవి హంతకుడు మొద్దుశీనును చంపేశారని, కాబట్టి ఇప్పుడు కడప జైల్లోనూ అదే జరగబోతోందని సీబీఐకి ఫిర్యాదు చేసింది.

వివేకా హత్య కేసు కొలిక్కి
కడప జిల్లా పులివెందులలో దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఛార్జిషీట్లు దాఖలు చేస్తున్న సీబీఐ.. అందులో ఉన్న పలువురిని కోర్టు సాయంతో కడప సెంట్రల్ జైలుకు తరలిస్తోంది. త్వరలో కేసు చిక్కుముడి వీడిపోతే ఆయా నిందితుల్లో దోషులుగా నిరూపణ అయిన వారికి శిక్షలు ఖరారు కూడా చేస్తారు. అయితే ఆ లోపే వారికి ప్రాణహాని పెరుగుతోంది. దీంతో ఈ వ్యవహారంపై విపక్షాలు దృష్టిసారిస్తున్నాయి.

వివేకా హంతకులకు ప్రాణహాని?
కడప సెంట్రల్ జైలు జైలర్ గా అనంతపురంలో ఉన్న వివాదాస్పద అధికారి వరుణారెడ్డిని నియమించడం ఇప్పుడుమరో వివాదానికి తావిచ్చింది. ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించిన వివేకా హత్య కేసు నిందితులకు వరుణారెడ్డి ఆధ్వర్యంలో ప్రాణహాని ఉందనే అనుమానాల్ని టీడీపీ వ్యక్తం చేస్తోంది. దీంతో వరుణారెడ్డి నియామకంపై టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వరుణారెడ్డి సాయంతో వివేకా హంతకుల్ని మట్టుబెడతారనే భయాల్ని టీడీపీ వ్యక్తం చేస్తుండగా.. సీబీఐ మాత్రం దీనిపై ఇప్పటివరకూ నోరు మెదపలేదు.

సీబీఐకి టీడీపీ ఫిర్యాదు
కడప సెంట్రలో జైల్లో ఉంచిన వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణహాని ఉందంటూ సీబీఐకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. సీబీఐకి రాసిన లేఖలో ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. ఇందులో వివేకా హత్య జరిగిన రోజు నుంచీ చోటు చేసుకున్న పరిణామాల్ని సీబీఐ దృష్టికి తెచ్చారు. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు, హత్యకు ఆనవాళ్లు చెరిపేసేందుకు వైఎస్ కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు, వివేకా కుమార్తె పెట్టిన కేసుల్ని గుర్తుచేశారు. అలాగే వరుణారెడ్డిని అక్కడి నుంచి మార్చాలని కూడా సీబీఐకి రాసిన లేఖలో వర్ల రామయ్య కోరారు.
Recommended Video

వరుణారెడ్డిని ఎందుకు మార్చాలంటే?
ప్రస్తుతం కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌గా ఉన్న వరుణారెడ్డి గతంలో పరిటాల రవీంద్ర హత్యకేసులో నిందితుల్ని ఉంచిన అనంతపురం జిల్లా జైలు జైలర్‌గా పని చేసిన సమయంలో 2008 నవంబర్ 11వ తేదీ రాత్రి ప్రధాన నిందితుడు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను తన జైలు గదిలోనే సహ నిందితుడి చేతిలో సిమెంట్ డంబ్ బెల్ తో దారుణంగా హతమార్చబడ్డాడని వర్ల రామయ్య సీబీఐకి తెలిపారు.
ఈ ఘటనతో అప్పటి అనంతపురం జిల్లా జైలు జైలర్ వరుణారెడ్డిపై పలు ఆరోపణలు వచ్చాయన్నారు. వరుణారెడ్డి తన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, డంబెల్‌ను జైలు బ్యారక్‌లోకి అనుమతించినందుకు, పర్యవేక్షణలో అలసత్వం వహించినందుకు సస్పెన్షన్ కు గురయ్యారని తెలిపారు.అదేవిధంగా వరుణా రెడ్డి తాను పనిచేసిన చాలా చోట్ల తన న్యాయబద్ధమైన విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని,. అందుకు అనేక శిక్షలకు గురయ్యారని కూడా తెలిపారు.
ఆశ్చర్యకరంగా, ప్రస్తుత ప్రభుత్వం వరుణారెడ్డిపై శిక్షల్ని ఉపసంహరించి కడప జైలుకు జైలర్ గా నియమించిందన్నారు. కాబట్టి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప సెంట్రల్ జైలులో ఉన్న నిందితుల భద్రత దృష్ట్యా వరుణారెడ్డిని కడప జైలు నుంచి బదిలీ చేయాలని కోరారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications