వర్మ చేతికే పిఠాపురం - బీజేపీ, జనసేన నియోజకవర్గాల్లో చంద్రబాబు మార్క్ నిర్ణయం..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేస్తున్నాయి. కీలక నిర్ణయాలు అమలు చేస్తు న్నాయి. బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై టీడీపీ అధిష్ఠానం దృష్టి సారించింది. చంద్రబాబు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. కీలక కసరత్తు చేస్తున్నారు. ముఖ్యులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ మేరకు ఆ నియోజకవర్గాల్లో టీడీపీ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతోంది.
మిత్రపక్షాల నియోజకవర్గాల్లో
టీడీపీ అధినేత చంద్రబాబు మిత్రపక్షాల ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల పైన ఫోకస్ చేసారు . అక్కడ పార్టీ బలోపేతం దిశగా కసరత్తు మొదలు పెట్టారు. అందులో భాగంగా నియోజకక వర్గ ఇన్‌చార్జుల నియామకం పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుతం పార్టీ సమన్వయకర్తలు ఉన్నా.. వారు పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు చేపట్టకపోవడం.. మిత్ర పక్షాలతో సమన్వయలోపం వంటి కారణాలతో కొత్త ఇన్‌చార్జులను నియమించాలని డిసైడ్ అయ్యా రు. 2024 ఎన్నికల్లో జనసేన 21, బీజేపీ 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అదే విధంగా బద్వేలు, అరకు సీట్లలో బీజేపీ ఓడిపోయింది.

వర్మకే బాధ్యతలు
కాగా, ఈ 31 స్థానాల్లో ఇప్పుడు టీడీపీ సమ న్వయకర్తలున్నా పార్టీ కార్యకర్తలను పెద్దగా పట్టించుకో వడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో కేడర్ బలహీనపడే ప్రమాదం ఉందని భావించిన నాయ కత్వం పూర్తిస్థాయి ఇన్‌చార్జుల నియామ కంపై కసరత్తు మొదలు పెట్టారు. పార్టీ ఇంఛార్జ్ ల నియా మకం పైన చంద్రబాబు ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివాదాలకు తావు లేకుండా మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కోసం కోసం పని చేసే నేతలకు ప్రాధాన్యత ఇస్తు న్నారు. పిఠాపురం నియోజకవర్గం బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మకు అప్పగించా లని నిర్ణయించారు. వర్మ తనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉండడంతో ఆయన్ను ఇటీవల చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. నియోజకవర్గంలో జనసేన శ్రేణులతో సమన్వ యం చేసుకుంటూనే టీడీపీని బలోపేతంపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు.
ఆ నియోజకవర్గాల్లో
ఇక, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న కాకినాడ రూరల్‌లో ప్రస్తుతం సమన్వయకర్తగా పిల్లి అనంతలక్ష్మి, సహాయ సమన్వయకర్తగా కటకంశెట్టి బాబీ ఉన్నారు. పిల్లి వర్గంపై స్థానికంగా టీడీపీ శ్రేణుల్లో వ్యతి రేకత ఉందని.. దీంతో బాబీకి బాధ్యతలు అప్పగించే అవకాశముందని అంటున్నారు. అనపర్తి ఇన్‌చార్జిగా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్‌ను నియమించ నున్నారు. రాజోలు ఇన్‌చార్జిగా గుబ్బల శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ-మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, తిరుపతి-సుగుణమ్మ, అవనిగడ్డలో బొబ్బా గోవర్ధన్‌కు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. మిగిలిన నియోజకవర్గాల్లోనూ త్వరలోనే ఇంఛార్జ్ లను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications