జనసేనకు షాక్ ఇవ్వనున్న తెలుగుదేశం? రాజకీయ వ్యూహకర్తల అంచనా!!
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. అసామాన్యమైన వ్యక్తి. రాజకీయ చాణక్యుడిగా పేరు. అటువంటి బాబు ఇటీవల జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈ పర్యటనలతో తెలుగుదేశం పార్టీ ఆలోచనా తీరు మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతోపాటు వెల్లువలా వస్తున్నారు. ఈ స్పందన చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచనా తీరులో మార్పు వచ్చిందంటున్నారు.

ప్రతిరోజు చంద్రబాబును కలుస్తున్న నాయకులు
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి ప్రతి రోజు నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును కలుస్తున్నారు. జనసేనతో పొత్తు వద్దని, అధికార పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, సొంతంగా పోటీచేద్దామని చెబుతున్నారు. జనసేన వైపు నుంచి కూడా ఈసారి తెలుగుదేశం పార్టీని కొన్ని గొంతెమ్మ కోరికలు కోరుతుండటంతో తమ అధినేత పునరాలోచనలో పడ్డారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

75 సీట్లు కావాలి.. అధికారం పంచుకోవాలంటున్న జనసేన
జనసేనకు 75 సీట్లు ఇవ్వాలని, అలాగే అధికారాన్ని పంచుకోవాలని, వీలైతే ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్‌ను ఎంపిక చేయాలని కాపు నేతలు కోరుతున్నారు. జనసేనతో పొత్తువల్ల కాపులు ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతారో తెలియదుకానీ బీసీలు దూరమయ్యే పరిస్థితి ఉందని సీనియర్ రాజకీయ వేత్తలు అంచనా వేస్తున్నారు.

సీట్లు త్యాగం చేస్తే మొదటికే మోసం వస్తుంది
పొత్తుల పేరుతో 50 సీట్ల వరకు త్యాగం చేస్తే మొదటికే మోసం వస్తుందని తెలుగుదేశం నేతలంటున్నారు. అంతేకాకుండా సీట్ల కోసం జనసేన నేతల బేరాలు, పవర్ షేరింగ్‌లాంటివన్నీ ఒప్పుకుంటే కొత్త సమస్యలు తలెత్తుతాయంటున్నారు. తెలుగుదేశం కూడా అంత సులువుగా ఈ ప్రతిపాదనలకు అంగీకరించే అవకాశం కనపడటంలేదని భావిస్తున్నారు.
జిల్లాల పర్యటన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆలోచనా తీరులో మార్పు వచ్చిందని, ఇప్పటికీ రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీయేనని, ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేద్దామంటూ పార్టీ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నా ప్రజలు టీడీపీనే గెలిపిస్తారు కాబట్టి వేరే ఆలోచన చేయవద్దంటున్నారు. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సింది చంద్రబాబునాయుడు ఒక్కరే..!!
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications