పులివెందుల ఎన్నికల్లో టీడీపీ విజయంపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. టిడిపి విజయం సాధించిన అనంతరం జగన్ సొంత గడ్డ పైన వైసీపీని, టిడిపి కొట్టిన దెబ్బపై రాష్ట్ర రాజకీయాలలో చర్చ మొదలైంది. ఇక ఈ విజయంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.

పులివెందుల విజయంపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
పులివెందులలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయని, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వస్తే, ఈ ఎన్నికలతో పులివెందులకు 40 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన బాలయ్య అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత పులివెందుల విజయం పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

tdp victory pulivendula zptc election balakrishna btech ravi and ministers shocking response

ప్రజలు స్వేచ్చగా ఓట్లు వేశారన్న బాలయ్య
పులివెందుల ప్రజలు ప్రస్తుతం స్వేచ్ఛగా ముందుకు వచ్చి ఓట్లు వేశారని, ఓటర్లు ధైర్యాన్ని చూపించారని అన్నారు. గతంలో పులివెందులలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయి అని పేర్కొన్న బాలయ్య, ఈసారి 11 మంది అభ్యర్థులు నామినేషన్ వేయడం ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

పులివెందుల గెలుపుకు కారణం ఇదే: బీటెక్ రవి
ఇక పులివెందుల ఎన్నికల విజయం పైన మాట్లాడిన టిడిపి నేత బీటెక్ రవి గతంలో పులివెందులలో ఎన్నికలంటే ప్రజలు భయపడే వారిని, కానీ ప్రస్తుతం ప్రజలు స్వేచ్ఛగా ఓటును వినియోగించుకున్నారు అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవడానికి తాము వారికి భరోసా ఇచ్చామని తెలిపారు. జగన్ కు బుద్ధి చెప్పాలి అనుకున్న ప్రజలు తమ ఓటు ద్వారా తీర్పు నిచ్చారని తెలిపారు. అధికార టిడిపి అందిస్తున్న పథకాలే ఈ గెలుపుకు కారణమని టిడిపి నేత బీటెక్ రవి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని టీడీపీ గెలవటం గొప్ప విషయం: మంత్రి రాం ప్రసాద్ రెడ్డి
పులివెందులలో టిడిపి విజయంపైన ఏపీ మంత్రులు స్పందిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే టిడిపికి ఓట్లు వేస్తారని ఎన్నికలు నిరూపించిందని మంత్రి రాం ప్రసాద్ రెడ్డి అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని టీడీపీ గెలవటం గొప్ప విషయమన్నారు. ప్రజలు టిడిపిని గెలిపించారని గతంలో ప్రజలను పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా వైసిపి భయభ్రాంతులకు గురి చేసిందన్నారు. తమ గెలుపుకు ప్రభుత్వ సంక్షేమపథకాలే కారణమని ఆయన స్పష్టం చేశారు.

జగన్ ప్రవర్తన వల్లే అతని పతనం: మంత్రి వాసంశెట్టి సుభాష్
పులివెందుల ఎన్నికల ఫలితాలు ముందే తెలిసే జగన్ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించాడని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జగన్ సొంత ఊర్లో ప్రజలు డిపాజిట్లు కూడా రాకుండా ఓడించారు అంటే జగన్ ఎంత అరాచకవాదినో అర్థమవుతుందన్నారు. జగన్ ప్రవర్తన వల్లే అతని పతనం అవుతున్నాడని ఈ ఎన్నికల్లో పులివెందులలో వైసిపి కూసాలు కదిలాయి అని వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+