రచ్చ.. రచ్చ.. : ప్రకాశంలో కుమ్మేసుకున్న టీడీపీ-వైసీపీ
ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య జిల్లా స్థాయి రాజకీయాలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి చేరుకుంటున్నాయి. తాజా ఫైట్ కు వేదికయింది ప్రకాశం జిల్లా. టీడీపీ, వైసీపీ ఇరు పార్టీల మధ్య ఘర్షణతో మంగళవారం రాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు రోడ్లకు మీదకు వచ్చి ఘర్షణకు దిగారు. ఈ పరస్పర దాడుల్లొ ఇరు వర్గాల కార్యకర్తలకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. భౌతిక దాడులకు దిగారన్న సమాచారం అందుకోగానే, అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

గాయాల పాలైన క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడంతో ఘటన జరిగిన చోటే పికెట్ ఏర్పాటు చేసిన పోలీసులు.. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా.. ఇరు వర్గాల మధ్య దాడులకు దారితీసిన అసలు కారణాలేంటో ఇంతవరకు తెలియరాలేదు.












Click it and Unblock the Notifications