కన్నాకు టీడీపీ అధికారిక ఆహ్వానం-ఆలపాటి రాజా భేటీ- అదే బాటలో విష్ణుకుమార్ రాజు ?
బీజేపీకి తాజాగా రాజీనామా చేసిన అసంతృప్త నేత కన్నా లక్ష్మీనారాయణను విపక్ష టీడీపీ ఇవాళ అధికారికంగా తమ పార్టీలోకి ఆహ్వానించింది. మరోవైపు మరికొందరు బీజేపీ నేతలు కూడా కన్నా బాట పట్టారు.
ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి, ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో గుడ్ బై చెప్పేసిన కన్నా లక్ష్మీనారాయణ తదుపరి అడుగులు వేస్తున్నారు. ఈ నెల 22న ఆయన టీడీపీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కన్నాను టీడీపీ అధికారికంగా ఆహ్వానం పలికింది. మరోవైపు కన్నా బాటలోనే ఆయనతో పాటు టీడీపీలో చేరేందుకు మరికొందరు బీజేపీ నేతలు కూడా సిద్ధమవుతున్నారు.

టీడీపీ కన్నాకు టీడీపీ ఆహ్వానం
బీజేపీకి తాజాగా గుడ్ బై చెప్పిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ ఇవాళ అధికారికంగా పార్టీలోకి ఆహ్వానం పలికింది. కన్నాతో ఇవాళ గుంటూరులోని ఆయన నివాసంలో టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ భేటీ అయ్యారు. టీడీపీలోకి రావాలని ఆయన్ను అధికారికంగా ఆహ్వానించారు. కన్నాతో ఆలపాటి రాజాది మర్యాదపూర్వక భేటీయేనని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 23న టీడీపీలో చేరనున్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామని ఆలపాటి రాజా తెలిపారు. కన్నాలాంటి బలమైన నేత టీడీపీలో చేరడం శుభసూచకమన్నారు.

23న టీడీపీలో చేరికకు సన్నాహాలు
కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23న టీడీపీలో చేరబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో కన్నా టీడీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. అయితే ఈ చేరిక ఆషామాషీగా కాకుండా భారీ ఎత్తున ఉండేలా కన్నా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీలో ఇప్పటివరకూ తనకు మద్దతుగా ఉన్న వారిని కూడా తెచ్చుకుంటున్నట్లు సమాచారం. బీజేపీకి గుడ్ బై చెప్పాక ఇప్పటికే పలువురు అనుచరులతో వరుసగా భేటీ అవుతున్న కన్నా దీనిపై ప్లాన్ చేసుకుంటున్నారు.

కన్నా బాటలోనే విష్ణుకుమార్ రాజు ?
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై నేపథ్యంలో ఆయన బాటలోనే మరికొందరు కాషాయ నేతలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఉండబోతున్నట్లు సమాచారం. ఇవాళ విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి వైదొలిగిన కన్నా లక్ష్మీనారాయణతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన భవిష్యత్తును చెప్పకనే చెప్పేస్తున్నాయి.

బీజేపీలో పరిస్ధితులు బాగోలేవన్న విష్ణుకుమార్ రాజు
ఇవాళ మాజీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో గుంటూరులోని ఆయన నివాసంలో భేటీ అయిన విష్ణుకుమార్ రాజు పార్టీకి కీలక సంకేతం పంపారు. కన్నాతో ఆయన తాజా పరిణామాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీ బీజేపీలో పరిస్థితులు బాగోలేవని విష్ణు వ్యాఖ్యానించారు. ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ నేతలతో మాట్లాడే తీరిక అధిష్టానానికి లేదని విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. ఈ నేపథ్యంలో విష్ణుతో పాటు పలువురు పార్టీ నేతలు కూడా కాషాయ శిబిరానికి గుడ్ బై చెప్పేస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications