'సీమాంధ్రలో టిడిపి ఫస్ట్, జగన్ సెకండ్-కెసిఆర్ ఏడాదే'

ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడిందన్నారు. సీమాంధ్రలో టిడిపికి ఎక్కువ సీట్లు, ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వస్తాయని జాతీయ సంస్థ సర్వే ప్రకటించిందన్నారు.
తెలంగాణలోను తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలకు మెజార్టీ సీట్లు వస్తాయని ఆ సంస్థ ప్రకటించిందన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలన్న తపనతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీని పదేళ్లుగా అభివృద్ధి చేశారన్నారు.
కానీ, ఇప్పుడు కాంగ్రెసులో విలీనమైనా ఏడాదికంటే ఎక్కువ సమయం ఆయనను కాంగ్రెసు నాయకులు పదవిలో ఉండనివ్వరన్నారు. తెలంగాణ ఇచ్చినా అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications