130స్థానాల్లో టీడీపీ విజయం పక్కా..స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కాపలా కాయండి..టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు
Recommended Video

ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలో ఓటింగ్ రికార్డుస్థాయిలో నమోదైంది . ఇది ఒక స్వాగతించదగ్గ పరిణామం. ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు ఎవరూ ఊహించలేదు .అర్దరాత్రి వరకు కొనసాగిన పోలింగ్ లో ఓటర్లు చాలా ఓపికతో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇంత భారీగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటారని ఏ రాజకీయ పార్టీలు ముందుగా అంచనా వేయలేదు. పలు ఉద్రిక్తతలు , పలు సాంకేతిక సమస్యల నడుమ పోలింగ్ కొనసాగింది .

175 స్థానాల్లో 130 గెలవటం ఖాయం అన్న చంద్రబాబు
400 కేంద్రాలలో సాంకేతిక సమస్యలవల్ల పోలింగ్ ఆలస్యం అయినందున అర్దరాత్రి కూడా ఓటింగ్ కొనసాగింది . 80 శాతం పైగా పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తుంది. ఇక ఏపీలో జరిగిన పోలింగ్ లో మొత్తం 175 స్థానాల్లో టీడీపీ 130 స్థానాలు కైవసం చేసుకోవటం పక్కా అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు . రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీదే అధికారమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

అర్దరాత్రి టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ .. ఫలితాలు వెలువడేవరకు స్ట్రాంగ్ రూమ్లకు కాపలా కాయాలని చెప్పిన బాబు
గురువారం అర్థరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తనకందిన సమాచారం ప్రకారం 130 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.అర్థరాత్రి వరకు పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు సీఎం అభినందనలు తెలిపారు. కౌంటింగ్ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలని, స్ట్రాంగ్ రూంల వద్ద వచ్చే 40 రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఫలితాలు వెలువడే వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు .

అర్దరాత్రి టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ .. ఫలితాలు వెలువడేవరకు స్ట్రాంగ్ రూమ్లకు కాపలా కాయాలని చెప్పిన బాబు
ఓడిపోతున్నామనే ఫస్ట్రేషన్‌తో వైసీపీ పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడిందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. రాష్రంలో పోలింగ్ సదర్భంగా జరిగిన గొడవలన్నీ వైసీపీ ఓటమి భయంతో చేసిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. అర్థరాత్రి 12 గంటలు అయిన తరువాత కూడా 200 పోలింగ్ బూత్‌లలో పోలింగ్ సాగిందన్నారు.మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈ పరిస్థితి కల్పించారని.. ఓటింగ్ సజావుగా సాగడానికి కార్యకర్తలు, ప్రజలే కారణమని... ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించినా ప్రజలు తెలుగుదేశం వైపే నిలిచారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈసారి పెరిగిన ఓటింగ్ కూడా తమకే అనుకూలంగా ఉందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు .
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications