వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురజాలలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ : కారణం ఏంటంటే ?

|
Google Oneindia TeluguNews

గురజాల : ఏపీ ఎన్నికల ఫలితాల ప్రభావమో ఏమో కానీ .. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య మళ్లీ గొడవ జరిగింది. గుంటూరు జిల్లా గురజాలలో ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ కర్రలతో దాడిచేసుకునే వరకు వెళ్లింది. ఫలితాలతో వైసీపీ జోష్ మీద ఉండగా .. ఓటమితో టీడీపీ సైలెంట్ అయ్యింది. ఈ క్రమంలో రెండు పార్టీ నేతల మధ్య గొడవ ప్రాధాన్యం సంతరించుకుంది.

నీటి కోసం పొట్లాట
గుంటూరు జిల్లా గురజాల మండలం శ్రీనివాసపురంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు బాహబాహీకి దిగారు. అసలే ఎండకాలం .. నీరు పట్టుకునే విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. ఇప్పటికే ఫలితాలతో టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. తమకు నీళ్లు కూడా ఇవ్వడం లేదని భావన వారిలో ఉంది. నీరు పట్టే విషయంలో మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. ఇరువర్గాలు పరస్పరం దూషణలు తీవ్రస్థాయికి చేరాయి. కర్రలు తీసి దాడులు చేసే వరకు పరిస్థితి వచ్చింది. దీంతో పలువురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

tdp, ycp workers fight at gurajala for water

సిచుయేషన్ కంట్రోల్
స్థానికులు సమాచారం అందివ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను అదుపులోకి తీసుకొని .. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వాటర్ ట్యాంక్ నుంచి నీరు పట్టుకునే విషయంలో గొడవ జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇరువర్గాల మధ్య మళ్లీ గొడవ జరగుతుందోమోనని భావించి .. గ్రామలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

English summary
Guntur district Gurujala mandalam in Srinivaspuram YCP and TDP activists fight. There is a feeling that they do not even give water. In the case of watering, the conflict began to become a hurricane. The mutual abuses went to the extreme. There was a situation where the sticks were taken and the attacks were made. Many were injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X