వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంపై అవిశ్వాసానికి టిడిపి, వైసీపీల నోటీసులు: విప్ జారీ చేసిన టిడిపి

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

No Confidence Motion : మళ్లీ అవిశ్వాస నోటీసులు, ఏం జరుగుతుంది...?

అమరావతి:ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్‌లో ఇవాళ మరోసారి కేంద్రంపై అవిశ్వాస నోటీసు తెరమీదికి రానుంది. ఇప్పటికే వైసీపీ, టిడిపిలు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఇవాళ పార్లమెంట్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఈ నోటీసుపై చర్చను చేపట్టే అవకాశం ఉంది.

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ తో పాటు విభజన చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్ తో వైసీపీ, టిడిపిలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

రెండు రోజుల క్రితం కేంద్రంపై ఇచ్చిన అవిశ్వాస నోటీసులు అందాయని స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. కానీ, సభ సజావుగా లేనందున ఈ తీర్మానంపై చర్చను చేపట్టలేనని స్పీకర్ ప్రకటించారు.

TDP, YSR Congress no-confidence motions notices given to lok sabha secretary

కేంద్రంపై టిడిపి, వైసీపీలు మరోసారి అవిశ్వాస నోటీసును ఇచ్చాయి. రెండు పార్టీలు తమ నోటీసులకు పార్టీలను మద్దతును కూడగడుతున్నాయి. తమకు 150 మంది సభ్యులు మద్దతుగా నిలిచారని ఏపీ విద్యాశాఖ మంత్రి , టిడిపి నేత గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.

వైసీపీ కూడ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పలు పార్టీల సభ్యుల మద్దతును కూడగడుతోంది.

శుక్రవారం నాడు అవిశ్వాస తీర్మానం నోటీసుపై లోక్‌సభలో చర్చ జరగలేదు. దీంతో మరోసారి ఈ రెండు పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులను ఇచ్చాయి.
తామిచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుకు ఇతర పార్టీల నుంచి తగినంత సంఖ్యాబలంతో మద్దతు లభిస్తుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చే విషయంలో తమ పార్టీయే ముందంజలో ఉందని, ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకోవడంలో కూడా తాము ముందున్నామని పేర్కొన్నారు.

మరోవైపు తమ పార్టీ అవిశ్వాస తీర్మానానికి 150 మంది సభ్యులు మద్దతిచ్చారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో టిడిపి ఎంపీలకు ఆ పార్టీ విప్ జారీ చేసింది. పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హజరుకావాలని ఆ పార్టీ ఆదేశించింది.

English summary
There is chance to discussion on no confidence motion on today in parliament.tdp, ysrcp were already given to notices of no confidence motion
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X