డేరాబాబా కంటే దేశద్రోహి: టిజి, కవిత, అధినేతలకు షాక్.. కంచ ఐలయ్యపై ఒక్కటైన టిడిపి-వైసిపి!

Posted By:
Subscribe to Oneindia Telugu
TDP and YSRCP fired at Kancha Ialaiah డేరాబాబా కంటే దేశద్రోహి: ఒక్కటైన టిడిపి-వైసిపి! | Oneindia

అమరావతి/హైదరాబాద్: సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకం రాసిన వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యపై ఆర్య వైశ్య నేతలు మండిపడుతున్నారు.

వైశ్యులపై యుద్ధమే, అంబేడ్కర్ తర్వాత అందుకోసం నేనే పుట్టాను: ఐలయ్య, టిఆర్ఎస్‌పై సంచలనం

హైదరాబాద్‌లో ఆదివారం నాడు ఆర్యవైశ్య మహాసభ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టిడిపి, వైసిపిలకు చెందిన పలువురు ఆర్యవైశ్య నేతలు హాజరయ్యారు.

దేశద్రోహులతో సమానం, అరబిక్ దేశాల్లో..

దేశద్రోహులతో సమానం, అరబిక్ దేశాల్లో..

ఈ సందర్భంగా టిడిపి నేత, రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ రచయిత కంచ ఐలయ్యపై నిప్పులు చెరిగారు. సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి వాళ్లు దేశద్రోహులతో సమానమన్నారు. అరబిక్ దేశాలలో ఇలాంటి వాళ్లను నడిరోడ్డు మీద శిక్షిస్తారని చెప్పారు.

నడిరోడ్డుపై ఉరితీసేలా చట్టాలు

నడిరోడ్డుపై ఉరితీసేలా చట్టాలు

ఒక మతాన్ని, ఒక కులాన్ని కించపరిచే ఇలాంటి వాళ్లను నడిరోడ్డు మీద ఉరితీసేలా చట్టాలు తీసుకు రావాలని టిజి వెంకటేష్ అన్నారు. అప్పుడే కులాల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి సంఘటనలు తగ్గుతాయన్నారు. మతిభ్రమించిన కొంతమంది నేతలు ఐలయ్యకు మద్దతు తెలుపుతున్నారన్నారు.

మూర్ఖంగా పుస్తకం రాయడం కాదు, వైశ్యుల చరిత్ర తెలుసుకో

మూర్ఖంగా పుస్తకం రాయడం కాదు, వైశ్యుల చరిత్ర తెలుసుకో

అన్ని ప్రాంతాల్లో ఐలయ్యపై కేసులు పెట్టి దేశమంతా తిప్పుతామన్నారు. మూర్ఖంగా పుస్తకం రాయడం కాదని, వైశ్యుల చరిత్ర తెలుసుకోవాలని టిజి వెంకటేష్ మండిపడ్డారు. మతాన్ని, కులాన్ని కించపరచడం సరికాదన్నారు.

డేరా బాబా కంటే పెద్ద ద్రోహి

డేరా బాబా కంటే పెద్ద ద్రోహి

కంచ ఐలయ్య డేరా బాబా కంటే పెద్ద ద్రోహి అని సినీ నటి కవిత మండిపడ్డారు. వైశ్యులను కించపరిచిన ఐలయ్యకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. అలాగే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావులు చొరవ తీసుకొని ఆయనను కఠినంగా శిక్షించాలన్నారు.

కంచ ఐలయ్యకు తగదు

కంచ ఐలయ్యకు తగదు

ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించే ఆర్య వైశ్యులను కించపరచడం కంచ ఐలయ్యకు తగదని నటి కవిత అన్నారు. సామాజిక దృక్పథంతో పని చేస్తున్న ఆర్య వైశ్యులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.

అప్పటిదాకా దూరం.. బాబు-జగన్‌లకు ఓ విధంగా అల్టిమేటం

అప్పటిదాకా దూరం.. బాబు-జగన్‌లకు ఓ విధంగా అల్టిమేటం

కాగా, కంచ ఐలయ్యపై పార్టీలకు అతీతంగా టిడిపి, వైసిపిలకు చెందిన ఆర్య వైశ్య నేతలు భేటీ అయ్యారు. ఐలయ్యపై చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించారు. అప్పటి వరకు ఇంటింటికి టిడిపి, వైసిపి కుటుంబం కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఇరు పార్టీలలోని వైశ్య నేతలు నిర్ణయించారని తెలుస్తోంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలని, చర్యలు తీసుకొకుంటే ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam and YSR Congress Party arya vysya leaders fired at writer Kancha Ialaiah for his controversial book samajika smugglurlu komatollu.
Please Wait while comments are loading...