యుద్ధాన్ని తలపించేలా!: మీడియా పాయింట్ వద్ద టీడీపీ-వైసీపీ 'ఫైట్'

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ బడ్జెట్ పై ఈరోజు సభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా.. ప్రతిపక్షాల ఆందోళన నడుమ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏపీ అసెంబ్లీని ఇప్పటికి రెండు సార్లు వాయిదా వేశారు. వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్దకు చేరుకున్న ఇరు వర్గాలు పోటాపోటీగా వాగ్వాదానికి దిగారు.

టీడీపీ ఎమ్మెల్యే అనితను అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రభుత్వ విధానాలను, అధికార పార్టీ నేతల తీరును తప్పుబట్టారు. టీడీపీ పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని గిడ్డి ఈశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో నిబంధనలకు విరుద్దంగా టీడీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అక్రమ కేసులతో తమ పార్టీ నేతలను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

TDP YSRCP Members allegations on each other at media point

గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో ఆమె పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అనిత వైసీపీ తీరును తప్పుపట్టారు. అనవసర ఆరోపణలతో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇరు పార్టీల నేతలు మీడియా పాయింట్ వద్ద పోటాపోటీగా వ్యవహరించడంతో.. ఎవరేం మాట్లాడుతున్నారో కూడా తెలియని స్థితి గందరగోళ స్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది.

మీడియా పాయింట్ వద్ద మహిళా ఎమ్మెల్యేలు మైకులు లాక్కోవడంతో ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు సైతం రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. పోలీసులు నచ్చజెప్పుతున్నా.. ఇరు పార్టీల నేతలు శాంతించడం లేదు.

మీడియా పాయింట్ వద్ద కూడా తమ హక్కులను కాలరాస్తున్నారని ఎమ్మెల్యే అనిత ఆరోపించారు. ఈ సందర్బంగా గతంలో గిడ్డి ఈశ్వరి సీఎంపై చేసిన వివాదస్పద వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. దీంతో గిడ్డి ఈశ్వరి ఫైర్ అయ్యారు. సీఎం తల నరకాలని తాను వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ తాను అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామాకైనా సిద్దమని ప్రకటించారు.

వాగ్యుద్దం మరింత ముదురుతుండటంతో మీడియా పాయింట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని మార్షల్స్ బలవంతంగా బయటకు తరలించారు. అనంతరం ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ..
తొలుత మీడియా పాయింట్ వద్దకు తామే వచ్చామని, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు తమను అడ్డుకుని దౌర్జన్యానికి దిగారని ఎమ్మెల్యే అనిత ఆరోపించారు. మహిళలను అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ సభ్యులు రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేటి అసెంబ్లీ తీర్మానాలు:

నేటి అసెంబ్లీ సమావేశంలో రెండు ఏకగ్రీవ తీర్మానాలకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు సిద్దం చేశారు. విజయవాడ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు, అలాగే రేణిగుంట ఎయిర్ పోర్టుకు శ్రీ వేంకటేశ్వర విమానశ్రయంగా పేర్లు మార్చాలని తీర్మానిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On this morning after adjourned the assembly for 10minutes both the party members are came to media point and made allegations eath other
Please Wait while comments are loading...