వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదీ లెక్క: బాబు-జగన్‌లకు ఒకే ఫలితం.. సర్వేల్లో జనం ఇలా తేల్చారట?

ఇటు టీడీపీ సర్వేలోను తమ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 15-18వేల మెజారిటీతో గెలుస్తారని తేలిందట. అంటే వైసీపీ చెబుతున్న మెజారిటీ కన్నా టీడీపీ మెజారిటీయే ఎక్కువ కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు సర్వేల మాటెత్తితే మునుపటిలా జనం కూడా వాటిని అంత విశ్వసనీయతలోకి తీసుకోవడం లేదు. కేవలం ఒక మైండ్ గేమ్ వ్యూహంతోనో.. లేదు తమకు తాము గొప్పలు పోవాలన్న భావనతోను.. ఎవరికి అనుకూలంగా వారు ఫలితాలు వెల్లడించడం జనానికి సర్వేల పట్ల ఆసక్తి లేకుండా చేసింది.

ఇదీ లెక్క: బాబు-జగన్‌లకు ఒకే ఫలితం.. సర్వేల్లో జనం ఇలా తేల్చారట?ఇదీ లెక్క: బాబు-జగన్‌లకు ఒకే ఫలితం.. సర్వేల్లో జనం ఇలా తేల్చారట?

సరే, జనం ఏమనుకున్నా.. వాళ్ల నాడి పట్టుకోగలిగింది మాత్రం మేమేనంటూ రాజకీయ పార్టీలు సర్వే తంతు కొనసాగించడం మానడం లేదు. ఏపీ రాజకీయాల్లోను ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నంద్యాల ఉపఎన్నికకు సంబంధించి.. ఏ పార్టీ చేయించుకున్న సర్వేలో ఆ పార్టీకి అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయట. ఇలాంటి సర్వే రిపోర్టులు అందరూ ఊహించినవే.

వేణు మాధవ్ జోస్యంలో నిజమెంత?.. అఖిలదీ అదే మాట: అలా జరుగుతుందా?వేణు మాధవ్ జోస్యంలో నిజమెంత?.. అఖిలదీ అదే మాట: అలా జరుగుతుందా?

అయితే ఆ సర్వే ఫలితాల చుట్టూ వినిపిస్తున్న కొన్ని ఆసక్తికర కథనాలు నంద్యాల ఉపఎన్నికను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి.

వైసీపీ సర్వేలో ఏం తేలింది?:

వైసీపీ సర్వేలో ఏం తేలింది?:

అధికార టీడీపీని ఎలాగైనా దెబ్బకొట్టి.. నంద్యాల ఉపఎన్నికతో 2019 ఎన్నికల విజయానికి బాట వేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు రోడ్ షోల పేరుతో ఆయన చాలానే శ్రమిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తరహాలోనే హామిలూ గుప్పిస్తున్నారు.

సరే ఉపఎన్నిక ఫలితం ఎలా ఉండబోతున్నది పక్కనపెడితే.. దీనిపై వైసీపీ ఓ సర్వే చేయించుకుందట. ఈ సర్వేలో తమ పార్టీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి 10-15 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని తేలిందట.

Recommended Video

Mahesh fans Support To YSRCP in Nandyal By polls, What About Pawan Kalyan | Oneindia Telugu
టీడీపీ సర్వేలో ఏం తేలింది?:

టీడీపీ సర్వేలో ఏం తేలింది?:

ఇటు టీడీపీ సర్వేలోను తమ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 15-18వేల మెజారిటీతో గెలుస్తారని తేలిందట. అంటే వైసీపీ చెబుతున్న మెజారిటీ కన్నా టీడీపీ మెజారిటీయే ఎక్కువ కనిపిస్తోంది. అయితే ఎన్నికల నాటికి ఈ మెజారిటీ ఎంత మేర నిలుస్తుందో చెప్పలేం కాబట్టి ఇంతకన్నా మెరుగైన మెజారిటీ కోసం ప్రయత్నించాలని మంత్రి అఖిలప్రియను సీఎం చంద్రబాబు ఆదేశించారట. అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి పదేపదే మెజారిటీ గురించే ఆలోచిస్తున్నామని చెప్పడం వెనుక ఇదే కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు పార్టీల సర్వేలు.. విజయమెవరిది?:

రెండు పార్టీల సర్వేలు.. విజయమెవరిది?:

సాధారణంగా ఇటీవలి కాలంలో వచ్చిన సర్వే ఫలితాల లాగే తాజా టీడీపీ, వైసీపీ సర్వేలు కూడా తమ తమ పార్టీలకు అనుకూలంగానే ఉన్నాయి. అయితే మెజారిటీ విషయంలో రెండు పార్టీలు 15వేలే అని లెక్క కడుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. రెండు పార్టీలు చెబుతున్న ఈ 15వేల మెజారిటీ ఎన్నికల నాటికి ఎవరి పక్షం అవుతుందనేది వారి విజయావకాశాలను నిర్ణయించనుంది.

వారిని ప్రభావితం చేయగలిగితే:

వారిని ప్రభావితం చేయగలిగితే:

నంద్యాలలో 2.30లక్షల ఓటర్లు ఉండగా.. అందులో ముస్లిం ఓటర్లు 70వేల దాకా ఉన్నారు. క్రిస్టియన్ ఓటర్లు మరో 5వేల పైచిలుకు ఉన్నారు. ఇక ఆయా కులాలన్ని కలిపి 135,596 వరకు ఉన్నారు. నంద్యాల తర్వాత ఆ స్థాయిలో ఎన్నికలను ప్రభావితం చేయగలిగేది గోస్పాడు మండలం. ఇక్కడ 44,177 పైచిలుకు జనాభా ఉండటంతో.. ఇక్కడి ఓటర్ల నిర్ణయం గెలుపోటములను నిర్ణయించేదిగా మారింది.

ముస్లిం ఓటర్లను, గోస్పాడు మండలాన్ని ఎక్కువ ప్రభావితం చేసేవారికే మెజారిటీ అవకాశాలు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టే రెండు పార్టీలు ఈ రెండింటిపై ఫోకస్ పెంచాయి. పార్టీలు చెప్పుకుంటున్న మెజారిటీలో ఈ రెండు కీలకం కావడంతో.. ఈ రెండు వర్గాలు ఎటువైపు నిలుస్తాయో అన్న దానిపైనే నంద్యాల ఉపఎన్నిక గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.

English summary
TDP and YSRCP continuing their high-pitched campaigns for the Nandyala assembly by-election, Recently both parties get their survey reports regarding by election
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X