తెలుగు పద్యం అప్పజెప్పలేదని.. విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్!
తెలుగు పద్యం అప్పజెప్పలేదనే కోపంతో ఓ టీచర్ కాలి చెప్పు తీసి విద్యార్థులను కొట్టిన ఉదంతమిది. తూర్పు గోదావరి జిల్లాలోని అడ్డతీగల మండలం డి.భీమవరం గ్రామం రెసిడెన్సియల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అమరావతి: తెలుగు పద్యం అప్పజెప్పలేదనే కోపంతో ఓ టీచర్ కాలి చెప్పు తీసి విద్యార్థులను కొట్టిన ఉదంతమిది. తూర్పు గోదావరి జిల్లాలోని అడ్డతీగల మండలం డి.భీమవరం గ్రామం రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న పి.గాంధీ.. విద్యార్థులను తెలుగు పద్యం అప్పజెప్పమన్నారు. అయితే, విద్యార్థులు ఆ పద్యాన్ని చెప్పలేకపోయారు. దీంతో, ఆగ్రహించిన గాంధీ తన కాలి చెప్పు తీసి విద్యార్థులను కొట్టాడు.

ఈ ఘటనపై పాఠశాలలో పనిచేస్తున్న తోటి టీచర్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా గిరిజన సంక్షేమ అధికారి జల్లి శాంబుడు పాఠశాలలో విచారణ జరిపారు. ఆయన నివేదిక అందిన తర్వాత ఉన్నతాధికారులు టీచర్ గాంధీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ''చెప్పుతో కొట్టడమేకాక, ఆ విషయం బయటకు చెబితే పదో తరగతి పరీక్షల్లో అందరినీ ఫెయిల్ చేసేస్తా అని టీచర్ గాంధీ మా పిల్లల్ని బెదిరించాడు..'' అని చెప్పారు. పాఠశాల హెడ్ మాస్టర్ కూడా గాంధీకే మద్దతు పలుకుతున్నారని వారు ఆరోపించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications