10వ తరగతి విద్యార్ధినికి లైంగిక వేధింపులు: టీచర్ అరెస్ట్

కాకినాడ: విద్యార్ధులకు పాఠాలు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే వికృత చేష్టలకు పాల్పడిన ఘటన తాజాగా కాకినాడ జగన్నాథపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్ధినిపై ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్(పీఈడీ) లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

బాధిత విద్యార్ధిని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... తనను ప్రేమించాలని, లేకుంటే హాల్ టికెట్ రాకుండా చేస్తానని వారం రోజులుగా తమ కుమార్తెను పీఈడీ వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు బుధవారం పాఠశాల ప్రతినిధులను నిలదీశారు.

Teacher harassment on student at Kakinada in East Godavari

దీంతో ఇబ్బందుల్లో ఉన్నానని చెబితే ఉద్యోగమిచ్చామని, విషయం తెలిసిన వెంటనే అతడిని ఉద్యోగం నుంచి తీసివేశామని పాఠశాల యాజమాన్యం చెప్పుకొచ్చింది. ఈ సమాధానికి సంతృప్తి చెందిన బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు నిందితుడిని చితకొట్టి, కాకినాడ వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు.

అయితే అతనిపై ఎటువంటి ఫిర్యాదు చేయక పోవడం విశేషం. నిందితుడికి బుద్ధి చెప్పేందుకే పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+