బందర్ టెక్కీ అనూహ్య రేప్, హత్య కేసు: చంద్రభానుకు ఉరిశిక్ష
ముంబై: మచిలీపట్నం నుంచి ముంబై వెళ్తూ అత్యాచారం, హత్యకు గురైన బందర్ టెక్కీ అనూహ్య కేసులో దోషిగా తేలిన చంద్రభాన్ సదమ్ సనప్కు ముంబై న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. న్యాయస్థానం శుక్రవారం తీర్పును వెల్లడించింది.
అనూహ్య పైన దారుణానికి ఒడిగట్టిన చంద్రభానుకు న్యాయస్థానం ఏం శిక్ష విధిస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. శుక్రవారం నాడు న్యాయస్థానం దోషి శిక్షను ఖరారు చేసింది.

ఉరిశిక్ష వేయాలి: అనూహ్య తండ్రి
తన కూతురు అనూహ్యను హత్య చేసిన చంద్రభానుకు ఉరిశిక్ష వేయాలని తల్లిదండ్రులు మొదటి నుంచి కోరుతున్నారు. ముంబై న్యాయస్థానం కూడా దోషికి ఉరిశిక్ష విధించింది. దీంతో అనూహ్య కుటుంబ సభ్యులో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, అనూహ్య కేసులో చంద్రభాన్ సుదమ్ సనప్ను ముంబై కోర్టు నాలుగు రోజుల క్రితం దోషిగా తేల్చింది. అనంతరం శిక్ష ఖరారును తొలుత బుధవారానికి వాయిదా వేసింది. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ బుధవారం కోర్టుకు విన్నవించారు. అనంతరం కోర్టు శిక్ష ఖరారును ఈ రోజుకు వాయిదా వేసింది.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications