అగ్రిగోల్డ్ ఆఫీస్‌లో ఐటీ సోదా: టెక్కీ ఆత్మహత్య, మరోచోట టెక్కీ భార్య
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని అగ్రిగోల్డ్ ప్రధాన కార్యాలయం పైన ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. అగ్రిగోల్డ్ సంస్థ అధినేత ఇంట్లోను ఐటీ అధికారులు గురువారం నాడు సోదాలు చేపట్టారు.
గ్యాస్ సిలిండర్‌పేలి ముగ్గురి పరిస్థితి విషమం
కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం, సందరయ్య కట్ట దగ్గర ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు
గుడివాడ వద్ద పంపుల చెరువు వద్ద పాఠశాల బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులను అద్దాలు పగులగొట్టి బయటకు తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
టెక్కీ ఆత్మహత్య
హైదరాబాదులోని మాదాపూర్‌లో ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పడక గదిలో సూసైడ్ నోట్ లభ్యమైంది. అతను ఒరిస్సాకు చెందిన సమీర్‌గా తెలుస్తోంది. బుధవారం సాయంత్రం వంట మనిషి వచ్చినప్పుడు అతను ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. మరోవైపు, మియాపూర్‌లో ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ భార్య బుధవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications