భార్యాకొడుకుల హత్య, టెక్కీ సూసైడ్: కుటుంబ కలహాలే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో భార్యను (శ్వేత), కన్నబిడ్డను (యష్) హత్యచేసి.. మనీష్ అనే టెక్కీ తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చర్యకు కుటుంబ కలహాలే కారణమని మనీష్ తల్లిదండ్రులతో పాటు శ్వేత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మనీష్, శ్వేత, యష్ మృతి నేపథ్యంలో కుటుంబ సభ్యులు గురువారం ఉదయం హైదరాబాదుకు వచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం వారి మృతదహాలను స్వగ్రామాలకు తీసుకు వెళ్లకుండా.. అంబరుపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

మనీష్, శ్వేత మధ్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నాయని, ఇరువురి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఇరు కుటుంబాల వారు పలుమార్లు సర్ది చెప్పినా వారిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆదివారం ఇరువురు గొడవ పడటంతో ఈ దారుణానికి దారి తీసి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు.












Click it and Unblock the Notifications