ఫ్యాన్‌కు ఉరేసుకుని టెక్కీ ఆత్మహత్య, బాలికపై రేప్

కొంత కాలంగా అతను హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో మానసికంగా కృంగిపోయాడు. దానికితోడు, తోటి ఉద్యోగులు కొందరు మానసికంగా వేధించడం ప్రారంభించారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో మనస్తాపానికి గురైన నాగరాజు శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు.
ఇదిలావుంటే, బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతన్ని రిమాండ్‌కు తరలించారు. హైదరాబాదులోని పాతబస్తీలో గల జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (14)ను తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్ అక్తర్ అలీ (25) ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.
ఈ నెల 11వ తేదీన పహాడీషరీఫ్‌లో నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications