ఏపీకి ప్రత్యేక హోదా: మోకాళ్లపై తిరుమలకు కడప జిల్లా టెక్కీ

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను కోరుతూ ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ మోకాళ్ల పైన తిరుమలకు బయలుదేరాడు. కడప జిల్లా రాయచోటికి చెందిన టెక్కీ ధనుంజయ రెడ్డి అలిపిరి నుంచి మోకాళ్ల పైన నడుస్తూ తిరుమలకు పయనమయ్యాడు.

కాగా, ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఎప్పటికప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ రాజ్యసభలో డిమాండ్ చేసింది. అయిదేళ్లు కాదని, పదేళ్లు హోదా కావాలని వెంకయ్య నాయుడు పట్టుబట్టారు.

Techie walks from Alipiri to Tirumala for Special Tag to AP

తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామన్నారు. హోదా తెప్పించే బాధ్యత తమదేనని టిడిపి చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇప్పటి దాకా హోదా రాలేదు. ఇది ప్రతిపక్ష కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఆయుధంగా మారింది. టిడిపి, బిజెపిలను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే, ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని, అంతకుమించిన ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని బీజెపి చెబుతోంది. దీనిపై టిడిపి కూడా రాజీ పడింది. హోదా కంటే మంచి ప్యాకేజీ ఇస్తోందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇటీవల హోదాపై రాజకీయ రగడ రాజుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం జగన్ బారా షహీద్ దర్గాలో ప్రత్యేక హోదా కావాలని ప్రార్థనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+