నిరుద్యోగులకు ఏపీ గుడ్‌న్యూస్.. నోటిఫికేషన్ విడుదల
ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ అప్పులపాలవడంతో అభివృద్ధి పథంలో పయనిస్తేనే రాష్ట్రానికి ఆదాయం సమకూరే అవకాశం ఉందని, అంతకుమించి మార్గం లేదని అధికారులకు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెడుతూనే మరోవైపు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. ఐదు సంవత్సరాల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామనేది తెలుగుదేశం పార్టీ ప్రధాన హామీగా ఉంది. తాజాగా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యవసాయశాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో
వ్యవసాయ శాఖలో ఫీల్డ్ / టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత కలిగినవారు తమ బయోడేటా, ఒక తాజా పాస్ పోర్టు కలర్ ఫొటో, ఒరిజినల్ ధ్రువపత్రాలు, ఒక సెట్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని అధికారులు కోరారు. ఇంటర్వ్యూలు 23వ తేదీన జరగనున్నాయి. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫీల్డ్ / టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం నాలుగు పోస్టులున్నాయి. అగ్రికల్చర్ లో డిప్లమో చేసినవారు, 18 సంవత్సరాల వయసు నిండినవారు దరఖాస్తు చేయాలి. వేతనం రూ.18,500 చెల్లిస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లో ఇంటర్వ్యూ జరుగుతుంది. 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఇంటర్వ్యూ ప్రారంభం కానుంది.

తిరిగి ఏజెన్సీలను ఆహ్వానించాలని
గతంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై దృష్టిసారించకపోవడంతోపాటు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసింది. ఆప్కాబ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఏజెన్సీల కింద ఉండే ఉద్యోగులందరినీ ఆప్కాబ్ కు యాడ్ చేసింది. అయితే ఈ సంస్థలో ఉద్యోగులు భారీ సంఖ్యలో కాంట్రాక్టు ప్రాతిపదికన గత ప్రభుత్వం ఎంపిక చేసి భారీగా వేతనాలు చెల్లించడంతో ఈ సంస్థను రద్దు చేసి తిరిగి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను ఆహ్వానించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం రూపొందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications