చంద్రబాబు, వెంకయ్య ఎక్కాక మొరాయించిన హెలికాప్టర్!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రయాణించే హెలికాప్టర్‌లో సాంకేతికలోపం తలెత్తింది. గురువారం నాడు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బహిరంగసభలో వీరిద్దరూ పాల్గొన్న విషయం తెలిసిందే.

అనంతరం వారు విజయవాడ వెళ్లేందుకు హెలికాప్టర్‌ ఎక్కారు. ఈ సమయంలో హెలికాప్టర్‌లో మొరాయించింది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్‌ గుర్తించి, వారికి ఈ విషయాన్ని చెప్పారు. దీంతో వారిద్దరూ రోడ్డుమార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.

Photos: చంద్రబాబు శంకుస్థాపన

Technical problem in helicopter, Chandrababu reaches Vijayawada on road

హెలికాఫ్టర్ టేకాఫ్ కష్టమన్న సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు కూడా పైలెట్ తెలియజేశాడు. దీంతో వారి ప్రయాణానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా వీరిని పంపించారు. జాతీయ రహదారిపై ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+