మేమే: షబ్బీర్ అలీ, పవన్‌కల్యాణ్‌తో మాట్లాడుతా: గంటా

తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో తాను చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం చెప్పారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు ఉన్నా ఉత్తరాంధ్రలో టిడిపికే ప్రజలు పట్టం కడతారన్నారు.
పార్టీకి తాము పూర్వ వైభవం తీసుకు వస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ టిడిపిలో చేరితే బాగుంటుందన్నారు. పవన్ సమస్యలపై స్పందించే మనస్తత్వం గల వ్యక్తి అన్నారు. పవన్‌ను తాను విమర్శించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు.
రాష్ట్రాన్ని కలుపుతామంటూ కిరణ్ పార్టీ పెట్టడం తగదని మాజీ మంత్రి గంటా అభిప్రాయపడ్డారు. విభజనపై ఢిల్లీ నేతల తీరు పట్ల ఇబ్బందిగా ఫీల్ అయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఆయనను కలచి వేసిందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications