రేవంత్ రెడ్డికి ఆంధ్రా సవాల్ ? విభజన సమస్యల నుంచి రాజకీయ వైఖరి వరకూ..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన రేవంత్ రెడ్డి రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి కోసం సొంత రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎదురుచూస్తున్నాయి. అదే సమయంలో పొరుగున ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఏపీ నుంచి కూడా ఆయనకు సవాళ్లు తప్పేలా లేవు. ముఖ్యంగా విభజన జరిగి పదేళ్లైనా పరిష్కారం కాని సమస్యలతో పాటు రాజకీయ సవాళ్లు కూడా ఉన్నాయి.

తెలంగాణలో సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రేవంత్ రెడ్డికి సొంత రాష్ట్రంలో ఎదురయ్యే సవాళ్లను పక్కనబెడితే ఏపీ నుంచి ఎదురయ్యే తొలిసవాల్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జీవం పోయడం. పొరుగున ఉన్న మరో రాష్ట్రం కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుని అందిపుచ్చుకుని తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఇప్పించిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు సీఎం కాగానే ఏపీలో కాంగ్రెస్ కు జీవం పోసే సవాల్ ఎదురుకాబోతోంది. అదీ నాలుగు నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్న తరుణంలో అసెంబ్లీలో ఉనికి చాటుకోవడం, ఒకరిద్దరు ఎంపీల్ని అయినా గెలిపించుకుంటే అది రేవంత్ కు కచ్చితంగా ప్లస్ అవుతుంది.

telangana cm elect revanth reddy to face these challenges in and with andhrapradesh..

మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరించబోతున్నారనే చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇన్నాళ్లు చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన వైసీపీ.. తెలంగాణ ఎన్నికల్లో సైతం ఆయన గెలవకూడదనే కోరుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అది మనసులో ఉంచుకుని జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా లేక సొంత సామాజిక వర్గం కావడంతో లైట్ తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

అలాగే ఏపీలో విపక్ష నేత, టీడీపీ అధినేత, తన రాజకీయ గురువు చంద్రబాబుతో రేవంత్ రెడ్డి వ్యవహారశైలి కూడా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను ప్రభావితం చేయబోతోంది. తెలంగాణ ఎన్నికల్లో తన కోసం పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ కు ఓట్లేయించిన టీడీపీ రుణం ఏపీలో రేవంత్ రెడ్డి తీర్చుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఏపీలో ఏమాత్రం బలం లేని బీజేపీకి టీడీపీ-జనసేనను దూరం చేసి కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకునేలా చేస్తారా అన్నది కూడా ముఖ్యమే. అదే జరిగితే ఏపీలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ ఇచ్చే సహకారం కాంగ్రెస్ కు ఇక్కడ జీవం పోయనుంది.

రాజకీయేతర అంశాల విషయానికొస్తే విభజన సమస్యలు పదేళ్లయినా అలాగే ఉన్నాయి. ఇవి పరిష్కారం కావాలంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సఖ్యత అవసరం. మరి రేవంత్-జగన్ భేటీ అవుతారా, విభజన సమస్యలపై కేసీఆర్ కు భిన్నంగా పట్టువిడుపులు ప్రదర్శిస్తారా అన్నది కీలకం. ఇప్పటికే నాగార్జున సాగర్ తో పాటు ఇతర ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించుకోవాలంటే ఏపీతో రేవంత్ వ్యవహారశైలి కీలకంగా మారబోతోంది. అలాగే కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న తరుణంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వీరిద్దరితో చేసుకునే సమన్వయం కీలకమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+