• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వామ్మో.. తెలంగాణలో వెయ్యికి చేరువలో కరోనా కేసులు..! ఏపీలో శరవేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19..!!

|

అమరావతి/హైదరాబాద్ : కొంత మంది విద్యార్థులు రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాసినా ఫెయిల్ అవుతూనే ఉంటారు. కరోనా క్లిష్ట సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితులు కూడా అలాగే తయారయ్యాయి. కరోనా మహమ్మారి కట్టడికి రెండు ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికి కేసులు మాత్రం శరవేగంగా పెరిగిపోతున్నాయి. కరోనా ప్రభావిత ప్రాంతాలను జోన్లుగా విభజించి కర్య్ఫూ విధించి కఠినంగా వ్యవహరిస్తున్నా పాజిటీవ్ కేసుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగిపోతుండడం ప్రభుత్వాలను విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణలో వెయ్యికి, ఏపిలో కూడా కేసుల సంఖ్య పెరిగిపోతుండడంపై ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది.

రెంగు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు.. వెయ్యికి చేరువవుతున్న కరోనా సంఖ్య..

రెంగు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు.. వెయ్యికి చేరువవుతున్న కరోనా సంఖ్య..

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అటు వైసీపి ప్రభుత్వాన్ని, ఇటు గులాబీ ప్రభుత్వాన్ని దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టేసింది కరోనా. ఇది ఎక్కడ ఆగుతుందో కూడా తెలియని అంతుచిక్కని పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి ఎన్నో అభివృద్ధి దేశాల కంటే మెరుగైన విధంగా తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. అయినా కొత్త కేసులు రావడం మాత్రం ఆగడం లేదు. గత రెండు రోజుల్లో 56 కేసులు పాజిటీవ్ గా నోదయ్యాయి. 8 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వెయ్యికి దగ్గర్లో ఉంది తెలంగాణ. ముఖ్యంగా హైదరాబాదు, సూర్యపేట జిల్లాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

తెలంగాణలో గణనీయంగా పెరిగిన కేసులు.. ఏపిలో ఆందోళన కలిగిస్తున్న కరోనా..

తెలంగాణలో గణనీయంగా పెరిగిన కేసులు.. ఏపిలో ఆందోళన కలిగిస్తున్న కరోనా..

తాజాగా హైదరాబాదులో కొత్త కేసులు గణనీయంగా వెలుగుచూశాయి. నిజామాబాద్ లో మూడు, గద్వాలలో రెండు, ఆదిలాబాద్ లో రెండు, ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కేసు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 988 కి చేరింది. ఈరోజు మొత్తం 194 మంది కోలుకోగా, 23 మరణాలు తెలంగాణ లో సంభవించాయి. ఇదే అంశం తెలంగాణలో ఆందోళన కలిగిస్తోంది. ఇంతటి పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నప్పటికి ఎందుకు కేసులు పెరుగుతున్నాయో అర్థం కాని చిక్కుముడిలా పరిణమించింది. లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేసే దిశగా సన్నాహాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

లాక్ డౌన్ ఆంక్షలు కఠిన తరం.. అయినా పెరుగుతున్న కేసులు..

లాక్ డౌన్ ఆంక్షలు కఠిన తరం.. అయినా పెరుగుతున్న కేసులు..

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో 46 కొత్త కేసులు నమోదవగా, మొత్తం సంఖ్య 825కి చేరాయి కరోనా కేసులు. కేవలం 96 మంది డిశ్చార్జి అయ్యారు. ఏపీలో కర్నూలు, గుంటూరు జిల్లాల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా తయారయ్యింది. ఇప్పటి వరకు 22 మంది మరణించారు. బుదవారం ఒక్కరోజే ఏపీలో 5022 శాంపుల్స్ ని పరీక్షించారు. ఇందులో చాలా వరకు కేసులు పాజిటీవ్ గా తేలే అవకాశం ఉన్నట్టు డాక్టర్లు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్నా, కేసులు ఒక్కసారిగా పెరిగిపోతుండడం ఆందోళనగా మారింది. రాష్ట్రంలో ప్రమాదకర జోన్లనుండి ఎవ్వరిని బయటకు రానివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా పెరుగుతున్న ప్రమాదకరంగా మారాయని తెలుస్తోంది.

కేసులు తగ్గకపోతే కఠిన ఆంక్షలు.. కార్యాచరణ రూపొందిస్తున్న తెలుగు ప్రభుత్వాలు..

కేసులు తగ్గకపోతే కఠిన ఆంక్షలు.. కార్యాచరణ రూపొందిస్తున్న తెలుగు ప్రభుత్వాలు..

మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు ప్రభుత్వాలను కలవరానికి గురిచేస్తున్నాయి. ప్రజల ప్రణాలు కాపాడడంలో దేశం ఒకడుగు వేస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాలు పదడుగులు వేస్తున్నాయి. అయినప్పటికి పాజిటీవ్ కేసులు సంఖ్య ఎందుకు పెరుగుతున్నాయో అర్థంకాని చిక్కు ప్రశ్నగా మారింది. ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నా, సరిహద్దులు సమూలంగా మూసి వేసిన కేసులు విజృంభిస్తున్నాయో వైద్యులకు సైతం పాలుపోని అంశంగా మారింది.

రాబోవు రోజుల్లో ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేసి కరోనా కట్టిడి చేయడం ఒక్కటే మార్గంగా రెండు తెలుగు రాష్ట్రాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

  Coronavirus : 31 Infected In Suryapet By One Woman Who Visited Several Houses For Ashtachamma Game

  English summary
  The two Telugu Governments are implementing stringent sanctions on the corona pandemic but the cases are escalating rapidly. The coronation of corona into zones has been drastically reduced and the number of positive cases is increasing, which is astonishing to governments. There has been an increase in the number of cases in Telangana and the number of AP in the government circles.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X