వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు కిరణ్‌నూ ఎక్కువమంది వ్యతిరేకించారు: టిపై ఖాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మెజార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారని, ఆనాడు సిఎల్పీలో ఓటింగు జరిగిందా అని రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ గురువారం ప్రశ్నించారు. తెలంగాణపై హైకమాండ్ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.

పూర్తి సంప్రదింపుల తర్వాతనే కాంగ్రెసు పార్టీ విభజనపై నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, పార్టీ ముఖ్యులందరితో మాట్లాడాకే తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

Telangana

విడిపోతే ఏడు సీట్లే: తులసి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ విడిపోతే 2014 ఎన్నికల్లో ఇరుప్రాంతాల్లో కలిపి ఏడు ఎంపీ సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వస్తాయని 20 సూత్రాల అమలు పథకం చైర్మన్, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి వేరుగా అన్నారు. ఆయన గురువారం ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి లేఖ రాశారు.

సివోటర్స్, ఇండియా టివి, టైమ్స్‌నౌ నిర్వహించిన సర్వే ఫలితాలను ఉటంకిస్తూ రాష్ట్రం కలిసుంటే 25 నుంచి 30 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికైనా విభజన ప్రక్రియను ఆపి రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని పార్టీని కాపాడాలని ఆయన అధిష్టానాన్ని కోరారు.

English summary
Rajya Sabha Member MA Khan said on Thursday that The 
 
 High Command took the decision to form Telangana 
 
 only after getting the consent of all the political 
 
 parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X