తెలంగాణా ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు, నారా లోకేష్ సందేశం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో తాజా ఎన్నికల ఫలితాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ పార్టీ శ్రేణులకు సందేశాన్ని పంపారు.
ఇక ఈ సందేశాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇందులో టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ ఓడిపోయిన వారిని పలుచన చేసే విధంగా వ్యాఖ్యలు చేయొద్దు అంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. తెలంగాణ ఎన్నికల ఫలితం ఏదైనా అది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల నిర్ణయం అని వారు పేర్కొన్నారు.

దానిని అన్ని పార్టీల వలే మనం కూడా శిరోధార్యంగా భావించాలని చంద్రబాబు, నారా లోకేష్ లు తెలిపారు. ఫలితాలను చూసి మీ మీ వ్యక్తిగత అభిప్రాయాల మేరకు గెలిచిన వ్యక్తులకు లేదా పార్టీలకు హుందాగా అభినందనలు తెలియజేయండి కానీ ఓడిపోయిన వ్యక్తులను, పార్టీలను పలుచన చేసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి సహజం అని పేర్కొన్న టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ లు 40 సంవత్సరాలకు పైగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పాల్గొని అధికార పక్షం పాత్ర అయినా, ప్రతిపక్షం పాత్ర అయినా, పార్టీ పరంగా కానీ, నాయకులు, కార్యకర్తల పరంగా కానీ మనం మన పాత్రను ఎంతో హుందాగా నిర్వహించాం అని గుర్తు చేశారు.
తెలంగాణాలో కాంగ్రెస్ విజయం వెనక చంద్రబాబు హస్తం ఉందని భావిస్తున్నారా ..??#Chandrababu #RahulGandhi #RevanthReddy #TelanganaAssemblyElectionResults2023 #ElectionResults #ElectionResults2023 #AssemblyElections2023 #ResultsWithOneindia #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) December 3, 2023
ఇప్పుడు కూడా హుందాగా వ్యవహరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని గౌరవిద్దాం అని పేర్కొన్నవారు రాష్ట్రంలో మనం ఎదుర్కోబోయే ఎన్నికలపై ఇప్పటినుంచి దృష్టి పెడదాం అంటూ ముగించారు. ఇక తెలంగాణా ఎన్నికల సమరం ముగిసింది కాబట్టి ఏపీ ఎన్నికలపై దృష్టి సారిస్తే మంచిది అన్న అభిప్రాయం వారు వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications