జగన్‌పై పోరులో షర్మిలకు అండగా ప్రచారానికి తెలంగాణా ఫైర్‌బ్రాండ్ మంత్రి కొండా సురేఖ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా రంగంలోకి దిగిన వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా వెళుతున్నారు. ఏపీలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ నూతన జవసత్వాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రస్తుతం జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటించి పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులతో పాటు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూల దృక్పధాన్ని పెంచే పనిలో ఉన్నారు.
ఈ క్రమంలో ఏపీ సీఎం, తన సోదరుడైన వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన పాలన పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటివరకు ఏపీలో ఎవరూ షర్మిల తరహాలో ఇంత తీవ్ర స్థాయిలో, ఇంత పదునైన విమర్శలు చేయలేదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏపీలో అన్నతో బలంగా ఢీ కొడుతున్న షర్మిలకు అండగా మరొక ఫైర్ బ్రాండ్ ఏపీ వెళ్లడానికి రెడీ అంటున్నారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు అండగా తెలంగాణ మంత్రి కొండ సురేఖ తాను సైతం రెడీ అంటున్నారు. వైయస్ జగన్ పాలనపైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న కొండ సురేఖ షర్మిలకు అండగా ఉంటానని, కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీలో కూడా ప్రచారం చేస్తానని వెల్లడించారు. అయితే తను ఏపీకి వెళ్లడానికి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని కొండా సురేఖ చెబుతున్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డితో తనకు అనుబంధం ఉందని, రాజకీయంగా ఆయన ఆశీర్వాదంతోనే తాను ఉన్నత స్థాయిలో ఉన్నానని కొండా సురేఖ చెబుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి లక్షణాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లో ఏమాత్రం లేవని ఇప్పటికి అనేకసార్లు విమర్శలు గుప్పించిన కొండ సురేఖ, అన్న తో తలపడుతున్న వైఎస్ షర్మిల కు ఏపీలో అండగా ఉంటానని, తన వంతు సహకారం అందిస్తానని చెబుతున్నారు.
ఇక కొండా సురేఖ కూడా వైఎస్ షర్మిల కోసం నిజంగానే ఏపీలో రంగంలోకి దిగితే జగన్ వీళ్ళ దాడిని తట్టుకోవడం కష్టమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్ కోసం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పందించి ఆయన వెంట నడిచిన నాయకులలో కొండా సురేఖ ఒకరు.
జగన్ సమైక్యరాగం అందుకోవడంతో పాటు, ఆయనతో వచ్చిన విబేధాల నేపధ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకురాలుగా ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆపై జగన్ తీరుపై ఆమె అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో జగన్ పాలన ఇలాగే కొనసాగితే ఏపీ మరో 20 ఏళ్ళు వెనక్కి వెళుతుందని కొండ సురేఖ పదేపదే చెబుతున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications