వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తగ్గిన టీ: ఫైనల్ సర్వే కాదు, రావాల్సిన అవసరం లేదు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana government to hold comprehensive social survey
హైదరాబాద్: విపక్షాల వరుస విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొంత తగ్గింది! ఈ నెల 19న నిర్వహించే సర్వే ఫైనల్ సర్వే కాదని, సరైన సమాచారం కోసం శాఖల వారీగా సర్వేలు ఉంటాయని తెలిపింది. ఈ నెల 19వ కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లో ఉండాలని సూచించింది.

సర్వేతో స్థానికతకు, ఫాస్ట్ పథకానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. సర్వే కోసం ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేస్తామన్నారు. రేపటిలోగా సర్వే ఫార్మాట్‌లో వెబ్ సైట్లో పెడతామని తెలిపింది. వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్లు రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎక్కడి వాళ్లు అక్కడే సర్వేకు వివరాలు ఇవ్వాలని తెలిపింది.

బయట చదువుకున్న విద్యార్థులకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఇతర చోట్ల చదువుతున్నట్లు ఆధారాలు చూపించాలని పేర్కొంది. ఈ నెల 19న జరిపే సర్వే ఆర్థిక, సాంఘిక సర్వే మాత్రమేనని తెలిపింది. ఇతర రాష్ట్రాలలో, విదేశాల్లో ఉన్న వారు రావాల్సిన అవసరం లేదని తెలిపింది.

విదేశాల్లో, ఇతర రాష్ట్రాలలో ఉన్న వాళ్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. హైదరాబాదుతో సహా అన్ని జిల్లాల్లో సర్వే నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర సర్వే సందర్భంగా కుటుంబ సభ్యులంతా తప్పనిసరిగా ఉంట్లో ఉండాలన్నారు.

English summary
Telangana government decide to conduct a comprehensive social survey of the state on 19 August.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X