ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తోంది... చంద్రబాబు
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చెలరేగిన ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ వివాదం తిరిగి తెలంగాణ రాష్ట్ర్ర ప్రభుత్వానికి చుట్టుకుంది. ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌ను అలంకరించకపోవడంతో ఘట్‌ను సందర్శించిన నేతలు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ముఖ్యంగా లక్ష్మీపార్వతీ చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో ఈ సంఘటనపై వివరణ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.

ఎన్టీఆర్ ఘాట్‌ను అలంకరించకపోవడంపై చంద్రబాబు స్పందిచారు. జయంతి సంధర్భంగా ఘాట్ వద్ద తెలంగాణ ప్రభుత్వమే అలంకరణ ఏర్పాట్లు చేసిందని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం కూడ ఘట్ అలంకరణ కోసం తెలంగాణ టీడీపీ నాయకులు ప్రభుత్వానికి లేఖ రాశారని ఆయన తెలిపారు. దీంతో గత సంవత్సరం వలనే ఘాట్‌ను అలంకరిస్తారని భావించామని చెప్పారు.
కాగా ఉదయం అలంకరణపై వివాదం చెలరేగడంతో ఆయన తెలంగాణ నేతలకు ఫోన్ చేసి జరిగిన విషయాలు కనుక్కొన్నట్టు చెప్పారు. ఇలాంటీ విషయాలు ప్రభుత్వానికి ముందుగానే తెలియజేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించక పోతే పార్టీ ద్వార ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో ఇలాంటీవి పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ పార్టీ నేతలకు ఆయన సూచించారు.
మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications