YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై హైకోర్టు కీలక నిర్ణయం..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకతన సాగుతుండటం, మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి ఎంపీగా పోటీకి సిద్ధమవుతుండటం, దీంతో ఆయనకు పోటీగా సోదరి వైఎస్ షర్మిల రంగంలోకి దిగడం చూస్తున్నాం. ఈ తరుణంలో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై కీలక తీర్పు వెలువడనుంది.
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి గతంలో ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఇదే కేసులో అప్రూవర్ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో షరతులతో కూడిన బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తున్నారంటూ దస్తగిరి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ కూడా ఆయన బెయిల్ రద్దుకు అనుకూలంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.

వివేకా హత్య కేసులో గతంలో ముందస్తు బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి ఈ కేసులో సాక్ష్యుల్ని ప్రభావితం చేస్తున్నారని, తనకూ బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ పిటిషనర్ దస్తగిరి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు త్వరలో ఆయన బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాల్సింది. అసలే ఎన్నికల వేళ కావడంతో హైకోర్టు ఇచ్చే తీర్పు అవినాష్ రెడ్డికి కీలకంగా మారింది. బెయిల్ రద్దయితే మాత్రం కడప లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనే అవకాశం లేకుండా పోతుంది.












Click it and Unblock the Notifications