వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెఏసి నేతలకు డిమాండ్: బిజెపి ఆఫర్‌కు కోదండరాం నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana JAC leaders are interested to join parties
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన నేపథ్యంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేతలు, ఇతర ఉద్యమకారులకు కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి తదితర పార్టీలు పెద్ద పీట వేస్తున్నాయి. ఐకాసలోని ఔత్సాహికులు కూడా రాజకీయ చౌరస్తాలో నిల్చున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. పోరాటం చేసిన పార్టీ తెరాస. పోరాటం చేసిన, సహకరించిన పార్టీ బిజెపి. ఈ మూడింటిలో దేనివైపు వెళ్లాలో పలువురు చూస్తున్నారు.

ఐకాసలో బిజెపి, తెరాస, న్యూడెమోక్రసీ వంటి రాజకీయ పార్టీలతో పాటు పలు ఉద్యోగ, ప్రజా సంఘాలు భాగస్వామిగా ఉన్నాయి. ఐకాస రాష్ట్రస్థాయి నేతల్లో ప్రధానంగా ఏడుగురు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. కో-చైర్మన్, టిఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి శనివారం ఆయన స్పష్టత ఇచ్చారు కూడా.

కెసిఆర్ ఆహ్వానం మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నానని, ఆయన ఆదేశం మేరకు తెరాస తరఫున మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించారు. ఇక, ఐకాసలో కీలక భాగస్వామ్య సంఘం టిఎన్జీవో అధ్యక్షులు దేవీప్రసాద రావు మెదక్ జిల్లా సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం లేదా మెదక్ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నారట. మల్లేపల్లి లక్ష్మయ్య పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని ఆశిస్తున్నారు.

ఐకాస అధికార ప్రతినిధి, తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి ఉత్సాహం చూపుతున్నారు. తెలంగాణ ధూంధాం వ్యవస్థాపక అధ్యక్షులు రసమయి బాలకిషన్ కరీంనగర్ జిల్లా మానకొండూరు లేదా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరికొందరు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారట.

వీరిలో శ్రీనివాస్ గౌడ్ మినహా మిగిలిన వారికి ఎవరికీ ఇప్పటి వరకూ ఏ పార్టీ తరఫున పోటీ చేయాలనే స్పష్టత రాలేదని సమాచారం. ఎక్కువ మంది తెరాస వైపు చూస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే రాజకీయ అరంగేట్రం చేయాలని భావిస్తున్న చాలామంది ఐకాస నేతలకు కాంగ్రెస్, బిజెపి పార్టీలన్నా వ్యతిరేకత లేదు. ఇప్పటికే ఆ రెండు పార్టీల నుంచి వీరికి ఆహ్వానాలు అందాయి కూడా. సిటింగ్ స్థానాలు మినహా మిగిలిన చోట్ల టికెట్లు ఇవ్వటానికి అభ్యంతరం లేదనే సంకేతాలు కాంగ్రెస్ నుంచి జెఏసి నేతలకు అందాయట.

మొదట తెరాసలోకి వెళ్దామని చాలామంది భావిస్తున్నారు. కెసిఆర్ నో అంటే బిజెపి, కాంగ్రెసుల వైపు వెళ్లేందుకు పలువురు రెడీగా ఉన్నారట. మరోవైపు, ఐకాస చైర్మన్ కోదండరాంకు తమ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం ఇప్పిస్తామని బిజెపి ప్రతిపాదించినప్పటికీ.. రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని కోదండ చెప్పారట. రంగారెడ్డి జిల్లా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి మరో టిఎన్జీవో నేత విఠల్‌పై ఉన్నప్పటికీ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటానికి ఆయన కూడా ఇష్టపడటం లేదు.

English summary
Many Telangana JAC leaders are interested to join into political parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X