హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'హైదరాబాద్‌పై మూడు ప్రతిపాదనలు మీడియా సృష్టే'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana leaders met Shinde
న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాదు పైన మూడు ప్రతిపాదనలు ఆలోచిస్తుందన్న వార్తలు కేవలం మీడియా సృష్టేనని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులకు చెప్పారట. మంగళవారం తెలంగాణ ప్రాంత నేతలు పలువురు షిండేను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. అదే సమయంలో హైదరాబాదు పైన మూడు ఆప్షన్స్ పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.

షిండేతో భేటీ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మూడు ప్రతిపాదనల పరిశీలన కేవలం మీడియా సృష్టేనని షిండే చెప్పారన్నారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు చెప్పారు. భద్రాచలం సబ్ డివిజన్‌ను తాము ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని, దానిని ఖమ్మంలోనే ఉంచాలని కోరామన్నారు.

షిండేతో ముఖ్యమంత్రి భేటీ

షిండేతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.

ఎపిఎన్జీవోల సమ్మెపై విచారణ వాయిదా

ఎపిఎన్జీవోల సమ్మెపై విచారణను హైకోర్టు ఈ నెల 27వ తేదికి వాయిదా వేసింది. రెండు పేజీలకు మించకుండా రాతపూర్వక వాదనలు సమర్పించాలని పిటిషనర్, ప్రతివాదులను న్యాయస్థానం ఆదేశించింది.

సహనం కోల్పోం: అశోక్ బాబు

ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా తాము సహనం కోల్పోదల్చుకోలేదని ఎపిఎన్జీవో అశోక్ బాబు అన్నారు. హైదరాబాదు ఏ ఒక్కరితోనే అభివృద్ధి చెందలేదన్నారు. హైదరాబాద్ అందరిదన్నారు. ప్రజల వద్దకు ఎంపీలు రావాలంటే రాజీనామాలు చేయాల్సిందేనని చెప్పారు. ఈ నెల 30 తర్వాత సమ్మెను తీవ్రతరం చేస్తామన్నారు.

English summary

 Congress leaders from Telangana met Central Home Minister Sushil Kumar Shinde on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X