అమరావతి ఆగిపోయింది కాబట్టి మనదే టాప్- కేటీఆర్ తాజా వ్యాఖ్యలు-ఏపీ నగరాలపై నో కామెంట్స్..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అమరావతి రాజధాని ప్రాంతం సీఆర్డీయే అభివృద్ధి చెందితే దేశంలోనే అతిపెద్ద అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీగా ఇది పేరు తెచ్చుకునేది. కానీ ఇప్పుడు ఇక్కడ పనులు ఆగిపోయాయి కాబట్టి హైదరాబాద్ హెచ్ఎండీఏ ప్రాంతమే దేశంలో టాప్ గా నిలవబోతోంది. ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్షాత్తు తెలంగాణ మంత్రి కేటీఆర్. గతంలో ఏపీలో నగరాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన కేటీఆర్.. ఈసారి వాటి గురించి ప్రస్తావించేందుకు మాత్రం నిరాకరించారు.

ఏపీలో నగరాల పరిస్ధితి గురించి గతంలో కేటీఆర్ హైదరాబాద్ లో క్రెడాయ్ నిర్వహించిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలు తెగ వైరల్ అయ్యాయి. వీటిపై స్పందించిన ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కేటీఆర్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేసేశారు. మీడియా సంగతి ఇక చెప్పేదేముంది. ఆ అనుభవంతోనో ఏమో ఈసారి ఏపీలో నగరాల గురించి మాట్లాడేందుకు మాత్రం తెలంగాణ మంత్రి కేటీఆర్ నిరాకరించారు.

telangana minister ktr says now hmda is larger than amaravati, no comments on ap cities

హైదరాబాద్ లో జరిగిన ఓ భవన నిర్మాణ సంస్ధల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇందులో అమరావతి నిర్మాణం ప్రారంభమై పూర్తయి ఉంటే దేశంలో అతిపెద్ద అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అయ్యేదని, ప్రస్తుతం అక్కడ పనులు జరగడం లేదు కాబట్టి ఆర్ ఆర్ ఆర్ (రీజనల్ రింగ్ రోడ్డు)తో కూడిన హెచ్ఎండీఏ ఆ స్ధానాన్ని ఆక్రమించబోతోందని కేటీఆర్ తెలిపారు. గతంలో తాను ఏపీ నగరాల గురించి మాట్లాడితే మీడియాలో దాన్ని 50సార్లు చూపించి వివాదాస్పదం చేశారని అన్నారు. ఇప్పుడు వాటిపై మాట్లాడనని.. విజయవాడ, గుంటూరు,వైజాగ్ అన్నీ బావున్నాయంటూ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+