మా బాబే ముందు, టీదేమీ లేదు: బియాస్‌పై ఎపి మంత్రి
కాకినాడ: హిమాచల్‌ప్రదేశ్ బియాస్ నది దుర్ఘటనపై ముందుగా స్పందించింది తమ ప్రభుత్వమేనని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి చిన రాజప్ప వ్యాఖ్యానించారు. బాధితులకు విమానాలు, వసతి పౌకర్యాలు ఏర్పాటు చేసింది తామేనని ఆయన అన్నారు.
చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించామని చిన రాజప్ప తెలిపారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనపై ముందుగా తమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారని అన్నారు.

బాధితులకు ఎక్స్‌గ్రేషియా తమ ప్రభుత్వమే ప్రకటించిందని, ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ హోంమంత్రి నాయని నాయిని నర్సింహారెడ్డి అక్కడ కూర్చుని రాజకీయం చేశారు తప్పితే చేసేది ఏమీ లేదని చిన రాజప్ప విమర్శించారు.
ఇటీవలి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది వరదల్లో 24 మంది హైదరాబాద్ విద్యార్థులు గల్లంతయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఇప్పటి వరకు 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications