వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రాలో అంతా రివర్స్ .. తెలంగాణలో అల్లూరి పుట్టి ఉంటే.. ? : శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

స్వాతంత్య్ర‌ సమర యోధుడు, మన్యం వీరుడు , అగ్గి పిడిగు అల్లూరు సీతారామ రాజు తెలంగాణలో పుట్టి ఉంటే 24 ఎకరాలు కేటాయించే వాళ్లమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర పాలకులు అల్లూరి కోసం ఏం చేశారో గాని .. తామైంతే ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేసేవాళ్లం అని చెప్పారు. కాగా, ఏపీ పరిస్థితులన్నీ తారుమారైయ్యాని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనే స్థాయికి భూముల ధరలు పడిపోయాయని శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ‌లో అల్లూరి పుట్టిఉంటే..

తెలంగాణ‌లో అల్లూరి పుట్టిఉంటే..

తెలుగు రాష్ట్రాల్లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అంటే గుర్తుపట్టని వారు ఉండరు. కానీ జాతీయ స్థాయిలో అల్లూరికి గుర్తింపు రాలేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చర్ క్లబ్‌లో అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి జాతీయ సంబరాలు ఆవిష్కరణ మహొత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు ఏపీ, తెలంగాణ మంత్రులు ఆవంతి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, నటుడు మోహన్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు హజరైయ్యారు. తెలంగాణలో అల్లూరి పుట్టి ఉంటే 24 ఎకరాలు కేటాయించే వాళ్లమని, దానిలో మ్యూజియం ఏర్పాటు చేసేవార‌మ‌ని చెప్పారు. దక్షిణాది వాడు, తెలుగు వాడైనందునే సీతారామరాజుపై కేంద్రం వివక్ష‌ చూపుతోందని విమర్శించారు. పార్లమెంటులో ఆయన విగ్రహం కూడా లేదన్నారు. దానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహకరించాలని కోరారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి కొంపల్లిలో అల్లూరి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

తెలంగాణ‌లో ఒక ఎక‌రం అమ్మితే .. ఆంధ్రాలో 100 ఎక‌రాలు కొనొచ్చు..

తెలంగాణ‌లో ఒక ఎక‌రం అమ్మితే .. ఆంధ్రాలో 100 ఎక‌రాలు కొనొచ్చు..

తెలంగాణలో మాత్రం ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. రాజులతో తమ ప్రభుత్వానికి ప్రత్యేక అనుబంధముందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో రాజులది కీలక పాత్ర అని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న భూములన్నీ రాజులవేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మారిపోయాయన్నారు. ఒకప్పుడు ఆంధ్రలో 10 ఎకరాలు అమ్మితే.. తెలంగాణలో 100 ఎకరాలు కొనేవారని.. ఇప్పుడు రివర్స్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో భూముల ధరలు పడిపోయాయని పేర్కొన్నారు. ఏపీలో 100 ఎకరాలు అమ్మితే తెలంగాణ ఒక్క ఎకరమే వస్తోందని హాట్ కామెంట్స్ చేశారు శ్రీనివాస్ గౌడ్..

అల్లూరి గ్రామానికి అవంతి ఏమి చేశారో చెప్పాలి..

అల్లూరి గ్రామానికి అవంతి ఏమి చేశారో చెప్పాలి..

ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు మోహ‌న్ బాబు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా, రెండు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేస్తున్న అవంతి శ్రీనివాస్ అల్లూరి సీతారామరాజు గ్రామానికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. త్వ‌ర‌లో అల్లూరు గ్రామానికి తాను వచ్చి అవంతి ఏమి చేశారో చూస్తానని మోహన్ బాబు తెలిపారు. అందరి సహాయం చేసే వ్యక్తి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అని కొనియాడారు. సౌత్ ఇండియా అంటే ఏమిటీ..? నార్త్ ఇండియా అంటే ఏమిటీ? గతంలో పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ప్రధాని మోదీ అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు మోహన్ బాబు..

English summary
TS Minister Srinivas Goud sensational comments on Andhra pradesh lands cost
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X