ఏపీకి ఫరవాలేదు, టీకి నిరాశ: ఏ రాష్ట్రానికి రాని ఐఐఎం

ఏపీకి కొంతలో కొంత ఊరట దక్కినప్పటికీ తెలంగాణకు మాత్రం నిరాశే మిగిలిందని అంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి కంటితుడుపు చర్యగా కేవలం హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం మాత్రమే ప్రతిపాదించారని, దీంతో పాటు హైదరాబాదులో డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారని అంటున్నారు.
మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ పైన కొంతలో కొంత వరాల జల్లు కురిపించినప్పటికీ తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపించారని అంటున్నారు. ఏపీకి వ్యవసాయ విశ్వవిద్యాలయం, విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్, కాకినాడ పోర్టు అభివృద్ధికి ప్రోత్సాహకాలు, కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీలతో పాటు ఐఐటీ, ఎయిమ్స్ ప్రతిపాదించారు. కాగా, రెండు రాష్ట్రాలకు ఐఐఎంలు రాలేదు.












Click it and Unblock the Notifications