విజయవాడ సహా పలు రైల్వేస్టేషన్‌లో హెల్ప్ డెస్కులు- ఫుడ్ ప్యాకెట్లు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. హైదరాబాద్ మొదలుకుని అన్ని జిల్లాల్లోనూ ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా- వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల వల్ల అటు గోదావరి నది వరదనీటితో పోటెత్తుతోంది.
భారీ వర్షాల ధాటికి ఉత్తర తెలంగాణ జిల్లాలు నిండా మునిగాయి. వరంగల్, ఖమ్మం, ములుగు, కొత్తగూడెం, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో వరద పోటు అధికంగా కనిపించింది. ఆయా జిల్లాల్లో ఉన్న రిజర్వాయర్లు, చెరువులు, వాగులు.. పొంగి పొర్లాయి. దాదాపు అన్ని రిజర్వాయర్ల గేట్లన్నింటినీ ఎత్తేశారు అధికారులు.

వర్షాల ధాటికి ఖాజీపేట్ రైల్వే స్టేషన్ మునిగిపోయింది. పట్టాలపై మోకాలిలోతు నీళ్లు ప్రవహించాయి. ఖాజీపేట్-హసన్‌పర్తి మార్గంలో పలు చోట్ల పట్టాలు కొట్టుకుపోయాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లపై వరద నీరు ప్రవహించడం కనిపించింది. దీనితో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లను దారి మళ్లించారు.
కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఆయా రైళ్లన్నీ ఏపీ మీదుగా రాకపోకలు సాగించేవే కావడం వల్ల విజయవాడ సహా పలు స్టేషన్లు బోసి పోయాయి. సమాయానికి రావాల్సిన రైళ్లు గమ్యస్థానాలకు చేరుకోకపోవడం వల్ల ప్రయాణికుల బంధువులు ఆందోళనకు గురయ్యారు.

వారి కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. విజయవాడ, ఒంగోలు, తెనాలి, సామర్లకోట, రాజమండ్రి.. వంటి స్టేషన్లలో హెల్ప్ డెస్కులు ఏర్పాటయ్యాయి. వారి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ప్రత్యేక సిబ్బందిని మోహరింపజేశారు.
అలాగే- తాము ఎక్కాల్సిన రైళ్లు రాకపోవడం వల్ల స్టేషన్లల్లో పడిగాపులు కాస్తోన్నారు. వారికోసం జన్ ఆహార్ ద్వారా ఆహార వసతిని కల్పించారు. చాలినన్ని ఫుడ్ ప్యాకెట్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు అందుబాటులో ఉంచారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications