ఏపిలో జగన్-పవన్ ను ఓడించాలంటే..ఇక్కడ గెలవాల్సిందే..బాబు చక్రం తిరిగేనా..!
తెలంగాణ ఎన్నికల్లో గెలుపెవరిది..మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది. కానీ, ఆ ఫలితాల ప్రభావం పోటీ చేసిన రెండు పార్టీల కంటే ఇద్దరి వ్యక్తుల ప్రతిష్ఠకు కీలకంగా మారింది. అంత కంటే..టిడిపి అధినేత - ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీ య భవిష్యత్ కు దిక్సూచిగా నిలుస్తోంది. తెలంగాణ లో కెసిఆర్ ను ఓడించాలి..కేంద్రంలో మోదీని ఓడించాలి..ఏపిలో తిరిగి అధికారంలలోకి రావాలి..ఇవే చంద్రబాబు ముందున్న లక్ష్యాలు. అందులో మొదటి లక్ష్యం తొ మిగిలిన రెండు అంశాలు ముడి పడి ఉన్నాయి. దీంతో..ఇప్పుడు చంద్రబాబు రాజకీయ భవిష్యత్ కు తెలంగాణ ఫలితాలు ఆధారంగా మారుతున్నాయి.తన అంతిమ లక్ష్యం అయిన ఏపిలో తిరిగి గెలవాలంటే ఇక్కడ ముందుగా గెలవాల్సిందే.. దీంతో.. తెలంగాణలో గెలిచినా..ఓడినా ఆ ఇమేజ్ అయినా..డామేజ్ అయినా చంద్రబాబుకే..మరి..బాబు చక్రం తిరిగేనా..

లక్ష్యం చేరాలంటే ..ఇక్కడ గెలవాల్సిందే..
టిడిపి అధినేత చంద్రబాబు కు రాజకీయ ప్రత్యర్ధి వాస్తవంగా కెసిఆర్ కాదు. చంద్రబాబు లక్ష్యం తెలంగాణ కాదు. ఆయన అంతిమ లక్ష్యం ఏపిలో తిరిగి అధికారం దక్కించుకోవటం. అందుకోసం ముందుగా బిజెపి పైకి వైఫల్యాలను నెట్టివేయ టం..ఏపికి మోదీ మోసం చేస్తున్నారని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటం..అటువంటి బిజెపికి ఏపి లో వైసిపి-జనసేన మద్దతు ఇస్తున్నాయని ప్రచారం చేయటం. దీని కోసం ముందుగా బిజెపి పై యుద్దం మొదలు పెట్టారు. తనకు రక్షణ కవచం గా ఉండటానికి ప్రజాస్వామ్య అనివార్యత పేరుతో కాంగ్రెస్ తో చేతులు కలిపారు. మొదటగా తెలంగాణ లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి..వ్యూహాత్మకంగా వ్యవహరించి రాహుల్ కు దగ్గరయ్యారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో తన సత్తా మోదీకి చాటాల నే సంకల్పంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తన మాట నెగ్గాలన్నా..తన మాటకు విలువ పెరగాలన్నా..రాహుల్ సైతం తన మాట కు నో అని చెప్పే పరిస్థితి లేకుండా ఉండాలన్నా.. ముందు గా తెలంగాణ లో గెలవాలి. తెలంగాణ లో కూటమి గెలుపుకు అవసరమైన వ్యూహాలన్నీ దాదాపు చంద్రబాబే సిద్దం చేసారు..చేస్తున్నారు. తెలంగాణలో గెలిచి.. ఢిల్లీ లో పట్టు బిగించి..ఏపిలో అధికారం నిలబెట్టుకోవటం కోసం చంద్ర బాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

పొత్తు ఆమోదం పై క్లారిటీ: సీమాంధ్రుల మూడ్ పై స్పష్టత
తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలు ఒక రకంగా చంద్రబాబు సత్తాకు..సమర్ధతకు పరీక్షగా మారుతున్నాయి. దశాబ్దాల రాజ కీయ వైరం పక్కన పెట్టి..మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో చేతులు కలిపిన చంద్రబాబు అదే పార్టీతో కలిసి తెలంగాణ లో పోటీ చేసారు. అందునా కేవలం 13 స్థానాలతో సరి పెట్టుకున్నారు. టిడిపికి సామాజిక కోణంలో అండగా నిలిచే ఖమ్మం.. ఆంధ్ర ప్రాంత సెటిలర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పోటీకి దిగింది. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ - టిడిపి పొత్తు పై కార్యకర్తల స్పందన..ప్రజల స్పందన ఎలా ఉందనేది తెలుసుకోవటానికి చంద్రబాబుకు ఈ ఎన్నికల ఫలితా లు ఒక ప్రోగ్రస్ కార్డుగా ఉపయోగ పడతాయి. తెలంగాణ ఫలితాలు ఎలా ఉన్నా..సీమాంధ్ర ఓటర్ల నాడి ఈ పొత్తు పైనా.. తన పాలన పైనా ప్రజలిచ్చే మార్కులు గా టిడిపి భావిస్తోంది. కుకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్ వంటి ప్రాంతాల్లో టిడిపి పోటీ చేస్తోంది. ఇక్కడ సెటిలర్ల ప్రభావం ఎక్కువ. అదే విధంగా..ఎల్‌బినగర్, మహేశ్వరం, మల్కాజ్ గిరి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో మిత్ర పక్షాల అభ్యర్ధులు పోటీ లో ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లు చంద్రబాబు - కాంగ్రెస్ పొత్తు..ఏపిలో పాలన పై ప్రజాభిప్రాయంగా భావించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ఏపిలో రాజకీయంగా వేయాల్సిన అడుగుల పై క్లారిటీ రానుంది.

ఇమేజ్ - డామేజ్ చంద్రబాబుకే..
తెలంగాణ లో ప్రజా కూటమి గెలిచినా..ఓడినా ఒక రకంగా అది చంద్రబాబుకు రాజకీయంగా ఇమేజ్ పెంచటం.. ఒకవేళ ఓడితే..డామేజ్ చేయటం అనే అంశం ఆధార పడి ఉంటుందని విశ్లేషకుల అంచనా. తెలంగాణ ఎన్నికల్లో కెసిఆర్ సైతం కాంగ్రెస్ కంటే చంద్రబాబునే టార్గెట్ చేసుకొని ప్రచారం చేసారు. ప్రజలు టిఆర్‌యస్ కు పట్టం కడితే..ఖచ్చితంగా కెసిఆర్ చేసిన ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. టిఆర్‌యస్ గెలిస్తే కాంగ్రెస్ నేతలు సైతం చంద్రబాబు తో పొత్తే కారణమని ప్రచారం చేసే అవకాశం లేక పోలేదు. ఇక, కూటమి గెలిచినా.. కాంగ్రెస్ తో పొత్తు కు ముందుకు వచ్చిన చంద్రబాబు కే ఆ క్రెడిట్ దక్కుతుంది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉండేదో...చంద్రబాబు వ్యూహాలు కలిసివచ్చి కూటమి గెలిచిందని ప్రచారం మొదలు పెట్టటం ద్వారా ఆ ఇమేజ్ బాబుకే దక్కనుంది. ఇలా..ఫలితం ఎలా ఉన్నా చంద్రబాబు చుట్టే చర్చ సాగనుంది. ఇక, తెలంగాణ లో గెలుపు సాధ్యమైతేనే..జాతీయ స్థాయిలో..ముఖ్యంగా ఏపిలో జగన్ -పవన్ ను ఎదర్కోవటానికి టిడిపి అధినేతకు నైతికంగా మరింత బలం పెరుగుతుంది. సీన్ రివర్స్ అయితే..రాజకీయంగా చంద్రబాబు చక్రం తిరగటం కష్టంగానే భావించాలి..












Click it and Unblock the Notifications