కృష్ణపట్నం కరెంట్ వద్దు, ధర ఎక్కువ: తెలంగాణ, హైద్రాబాద్‌లో ఏపీ ఎంసెట్ సెంటర్లు
హైదరాబాద్: తమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణపట్నం విద్యుత్ వద్దని, యూనిట్ వ్యయం ఎక్కువగా ఉందని తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కో ఎస్ఆర్ఎల్డీసీకి లేఖ రాసింది. కృష్ణపట్నంలో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణం పూర్తయి గత ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేస్తున్నారు.
ఇక్కడ ఒక్కోటి 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న కేంద్రాలు రెండున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం కృష్ణపట్నం నుంచి 53.89 శాతం తెలంగాణకు రావాలి. కానీ తమకు ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. తాజాగా, కృష్ణపట్నం విద్యుత్‌ను తీసుకోవద్దని నిర్ణయించిది.

హైదరాబాద్‌లో ఏపీ ఎంసెట్ కేంద్రాలు
హైదరాబాద్‌లోనూ ఎంసెట్ - 2015 ఎంట్రన్స్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. హైదరాబాద్‌ను మూడు జోన్‌లుగా విభజించి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
జోన్ ఏలో ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, చందానగర్, బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు, జోన్ బీలో బేగంపేట, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, జోన్ సీలో గగన్‌మహల్, నారాయణగూడ, బషీర్‌బాగ్, బర్కత్‌పురా, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, హనుమాన్ టెక్డీగా నిర్ణయించామన్నారు. విద్యార్థులు ఈ నెల 21లోగా జోన్ ఎంపిక చేసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications