జింకలా టీ ప్రజల మనసు: అధికార చిహ్నాలివే(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం ఖరారు చేశారు. రాష్ట్ర జంతువుగా జింక, వృక్షంగా జమ్మిచెట్టు, పక్షిగా పాలపిట్ట, పుష్పంగా తంగేడు పువ్వును ఎంపిక చేశారు. సచివాలయంలో సోమవారం రాష్ట్ర చిహ్నాల ఎంపికకు వచ్చిన ప్రతిపాదనలపై అధికారులతో చర్చించిన అనంతరం కేసీఆర్ వాటిని ఖరారు చేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నాలు ఇక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలన్నారు.

ఇంతవరకు సమైక్య రాష్ట్రంలో చిహ్నాలుగా ఉన్నవాటిని ఆంధ్ర కోణం నుంచి ఎంపిక చేశారన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో అధికారిక చిహ్నాలను కూడా తెలంగాణ కోణం నుంచి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అధికారిక చిహ్నాల కోసం వచ్చిన పలు ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం రాష్ట్ర జంతువుగా జింక, వృక్షంగా జమ్మిచెట్టు, పక్షిగా పాలపిట్ట, పుష్పంగా తంగేడు పువ్వును ఖరారు చేసినట్టు ప్రకటించారు.

భారతదేశ చరిత్రతో జింకకు ఎనలేని సంబంధం ఉందని, రామాయణం లాంటి గాథలలో జింకకు ప్రముఖ స్థానం ఉందన్నారు. అలాగే తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో జింకలున్నాయని, చిన్నపాటి అడువులలోనూ జింకలు మనుగడ సాగిస్తున్నాయన్నారు. అడవి జంతువులలో అత్యంత సున్నితమైన, అమాయకమైంది జింకని, ఇది తెలంగాణ ప్రజల మనస్థత్వానికి దగ్గరగా ఉంటుందన్నారు.

పాలపిట్ట

పాలపిట్ట

పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగమైందని, దసరా పండుగ రోజున దీన్ని దర్శించుకోవడాన్ని పవిత్రంగా భావిస్తారని, అలాగే పాలపిట్ట దర్శనాన్ని శుభశకునంగా భావిస్తారు.

జమ్మిచెట్టు

జమ్మిచెట్టు

జమ్మిచెట్టు కూడా తెలంగాణ ప్రజల జీవితంలో అంతర్భాగమని, దసరా పండుగ రోజున జమ్మిచెట్టుకు పూజలు చేసి, వాటి ఆకులను (బంగారం) ఒకరికొక్కరు ఇచ్చుకోవడం ఆనవాయితీ ఉంది.

తంగేడు పువ్వు

తంగేడు పువ్వు

తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగలో వాడే తంగేడు పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అడవిలో సహజసిద్ధంగా పెరిగే తంగేడు పువ్వు ప్రకృతికే అందాన్ని తెస్తుంది.

తంగేడు పువ్వు

తంగేడు పువ్వు

తంగేడు పూలను సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా తెలంగాణ ఆడపడుచులు భావిస్తారు. అందుకే రాష్ట్ర పుష్పంగా తంగేడును ఎంపిక చేసినట్లు సీఎం చెప్పారు.

జింక

జింక

భారతదేశ చరిత్రతో జింకకు ఎనలేని సంబంధం ఉందని, రామాయణం లాంటి గాథలలో జింకకు ప్రముఖ స్థానం ఉంది. అలాగే తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో జింకలున్నాయి, చిన్నపాటి అడువులలోనూ జింకలు మనుగడ సాగిస్తున్నాయి.

జింక

జింక

అడవి జంతువులలో అత్యంత సున్నితమైన, అమాయకమైంది జింకని, ఇది తెలంగాణ ప్రజల మనస్థత్వానికి దగ్గరగా ఉంటుందని కేసీఆర్ అన్నారు.

పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగమైందని, దసరా పండుగ రోజున దీన్ని దర్శించుకోవడాన్ని పవిత్రంగా భావిస్తారని, అలాగే పాలపిట్ట దర్శనాన్ని శుభశకునంగా భావిస్తారన్నారు. లంకా నగరం మీదికి దండయాత్ర చేసే ముందు శ్రీరామచంద్రుడు పాలపిట్టను దర్శించుకోవడంతో విజయం వరించిందని పౌరాణిక గాధలు చెబుతున్నాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం విజయపథంలో నడవడానికి శుభ సూచకంగా పాలపిట్టను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.

జమ్మిచెట్టు కూడా తెలంగాణ ప్రజల జీవితంలో అంతర్భాగమని, దసరా పండుగ రోజున జమ్మిచెట్టుకు పూజలు చేసి, వాటి ఆకులను (బంగారం) ఒకరికొక్కరు ఇచ్చుకోవడం ఆనవాయితీ ఉందన్నారు. అలాగే పాండవులు అజ్ఞాతవాసం చేయడానికి ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టుపై భద్రపర్చారన్నారు. తర్వాత వాటిని తీసుకెళ్లి యుద్ధంలో ఎక్కువమంది ఉన్న కౌరవులను ఓడించడానికి తక్కువ సంఖ్యలో ఉన్న పాండవులకు జమ్మిచెట్టు నుంచి శక్తి, ఆశ్వీర్వాదం లభించిందన్నారు.

అలాంటి జమ్మిచెట్టును అధికారిక చిహ్నంగా పెట్టుకోవడం తెలంగాణకు మేలు చేస్తుందన్నారు. వీటితోపాటు తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగలో వాడే తంగేడు పూలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అడవిలో సహజసిద్ధంగా పెరిగే తంగేడు పువ్వు ప్రకృతికే అందాన్ని తెస్తుందన్నారు. తంగేడు పూలను సౌభాగ్యాన్ని కాపాడే విశిష్ట పుష్పంగా తెలంగాణ ఆడపడుచులు భావిస్తారని, అందుకే రాష్ట్ర పుష్పంగా తంగేడును ఎంపిక చేసినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+