ఏపీ ఇంటర్ టాపర్‌గా తెలంగాణ అమ్మాయి: టాపర్లకు సీఎం పోన్

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నాగమల్లి యశశ్రీ గురువారం విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో టాపర్‌గా నిలిచింది.

విజయవాడ/వేములవాడ: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నాగమల్లి యశశ్రీ గురువారం విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో టాపర్‌గా నిలిచింది. వేములవాడకు చెందిన వైద్యులు నాగమల్ల శ్రీనివాస్‌, పద్మలత చిన్న కూతురు యశశ్రీ విజయవాడలో శ్రీ చైతన్య విద్యాసంస్థలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతుంది.

ఫలితాల్లో 440 మార్కులకు 436 సాధించి (మరో ముగ్గురితో పాటు) రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. దీంతో గురువారం వేములవాడలోని వారి నివాసంలో కుటుంబ సభ్యులు సంబురాలు జరుపుకున్నారు. కాగా, ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ ఎంపీసీ టాపర్‌గా ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ షర్మిలా నిలిచింది.

A Telangana student has topper in Andhra Pradesh intermediate results 2017.

ఇంటర్‌ టాపర్స్‌కు సీఎం ఫోన్‌

ఇంటర్‌ పరీక్షల్లో ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన వారికి ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌చేసి మాట్లాడారు. ఎంపీసీలో మొదటి స్థానంలో నిలిచిన షర్మిలాతో మాట్లాడుతూ.. టాపర్‌గా నిలిచినందుకు అభినందించారు. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు. వ్యక్తిగత వివరాలను తెలుసుకున్నారు.

కాగా, 'మీతో కనీసం అయిదు నిమిషాలైనా మాట్లాడాలని ఉంది సార్‌' అని విద్యార్థిని కోరగా తప్పకుండా అపాయింట్‌మెంట్‌ ఇస్తానని చెప్పారని షర్మిల తెలిపింది. ముఖ్యమంత్రి నేరుగా ఫోన్‌ చేసి అభినందనలు చెప్పడం జీవితంలో మరిచిపోలేనని పేర్కొంది.

ఇంటర్‌ బైపీసీ గ్రూపులో ప్రథమస్థానంలో నిలిచిన నైమిషితోనూ సీఎం ఫోన్‌లో సంభాషించారు. కార్డియాలజిస్టు కావాలన్న తన అభిలాషను ఆమె సీఎం ముందు ఉంచారు. ఉన్నత చదువులకు ఏ సహాయం కావాలన్నా చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. సోమవారం ఇంటర్‌ టాపర్స్‌ను సీఎం ప్రత్యక్షంగా కలిసి మాట్లాడనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+