స్థానిక రభస: విద్యార్థుల ఆందోళన, ఉద్రిక్తం (పిక్చర్స్)
హైదరాబాద్: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) విద్యార్థులు బుధవారం తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. ఎంసెట్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు.
తెలంగాణ స్థానికత, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిబంధనలను సాకుగా చూపి అడ్మిషన్ల ప్రక్రియను నిలిపేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయంలోకి చొరబడడానికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు.
విద్యార్థులను గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకుండా అడ్మిషన్లను ప్రక్రియను నిలిపేస్తోందని వారు విమర్శించారు. కౌన్సెలింగ్‌లో జాప్యం జరిగితే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని వారు విమర్శించారు.

సచివాలయ ముట్టడి
ఎంసెట్ కౌన్సెలింగ్‌ను వెంటనే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎఐఎస్ఎఫ్ కార్యకర్తలు సచివాలయ ముట్టడికి దిగారు.

అడ్డుకున్న పోలీసులు
సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన ఎఐఎస్ఎఫ్ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.

స్థానికత సాకు
స్థానికతను, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సాకుగా చూపించి కౌన్సెలింగ్‌ను నిలిపేయడం సరైంది కాదని విద్యార్థులు ఆరోపించారు.

విద్యార్థుల అరెస్టులు
సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన విద్యార్థులను హైదరాబాదులోని గాంధీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెంటనే కౌన్సెలింగ్ జరపాలి
ఎంసెట్, ఇతర వృత్తి కోర్సులకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను వెంటనే చేపట్టాలని, లేదంటే లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతారని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు.












Click it and Unblock the Notifications