వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి సర్వే: ఇంటిబాట పట్టారు, బస్సు కిటికీలోంచి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆగస్టు 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గత రెండు మూడు రోజుల నుంచే నగరంలో ఉంటున్న వారు వారి స్వస్థలాలకు వెళ్లడం ప్రారంభించారు. వారి వివరాలను ఆగస్టు 19న నిర్వహించే సర్వేలో నమోదు చేసుకునేందుకు వీరంతా వారి స్వస్థలాలకు బయల్దేరుతున్నారు.

ఇతర రాష్ట్రాల్లోని వారి కూడా తెలంగాణ బాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని తెలిపింది. సర్వేలో పాల్గొనే ఉద్యోగులు ఖచ్చితమైన ఆధారాలు చూపాలని పేర్కొంది. ప్రతి మండలాన్ని నాలుగు సెక్టార్లుగా విభజించి సర్వే నిర్వహించనున్నట్టు పేర్కొంది.

సర్వే నిర్వహించిన రెండు వారాలలోగా డాటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది. హైదరాబాద్ మినహాయించి 9 జిల్లాల్లో 14 వేల డాటా ఎంట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. సర్వేకు సంబంధించిన పూర్తి డాటా ఎంట్రీ సెప్టెంబర్ 4వ తేదీకి పూర్తి చేయాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన సర్వే వివరాలపై సెప్టెంబర్ 10 నుంచి స్ర్కుటిని జరుగుతోందని పేర్కొంది.

ఒక్కో ఎన్యూమరేటర్ 30 కుటుంబాలను సర్వే చేయాల్సి ఉండగా, వారికి ఒక్కొక్క బుక్‌లెట్‌లో 30 సర్వే ఫారాలను ఇవ్వనున్నట్టు తెలిపింది. జిహెచ్‌ఎంసి పరిధిలో సర్వే ఫారాలు ఇంగ్లీష్‌లో, గ్రామీణ ప్రాంతాలలో తెలుగులో ఉంటుందని వెల్లడించింది.

తెలంగాణ సర్వే

తెలంగాణ సర్వే

ఆగస్టు 19న నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

తెలంగాణ సర్వే

తెలంగాణ సర్వే

గత రెండు మూడు రోజుల నుంచే నగరంలో ఉంటున్న వారు వారి స్వస్థలాలకు వెళ్లడం ప్రారంభించారు. వారి వివరాలను ఆగస్టు 19న నిర్వహించే సర్వేలో నమోదు చేసుకునేందుకు వీరంతా వారి స్వస్థలాలకు బయల్దేరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని వారి కూడా తెలంగాణ బాటపట్టారు.

తెలంగాణ సర్వే

తెలంగాణ సర్వే

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 79లక్షల 55 వేల 673 కుటుంబాల సర్వే నిర్వహించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. సర్వేలో 2 లక్షల 94 వేల 830 మంది ఎన్యూమరేటర్స్ పాల్గొంటారని తెలిపింది.

తెలంగాణ సర్వే

తెలంగాణ సర్వే

సర్వేలో పాల్గొనే ఉద్యోగులు ఖచ్చితమైన ఆధారాలు చూపాలని పేర్కొంది. ప్రతి మండలాన్ని నాలుగు సెక్టార్లుగా విభజించి సర్వే నిర్వహించనున్నట్టు పేర్కొంది.

English summary
People went to their home towns to give their information to survey officers on 19th August.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X