రేవంత్ ఇష్యూను అడ్డం పెట్టుకొని..!: కేంద్రం ఆరా, మత్తయ్య ఘాటుగా

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర సమితి ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదును పెడుతుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు అనుమానిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

రేవంత్ వ్యవహారం ఆధారంగా మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలను తమ పార్టీలోకి తీసుకునేందుకు తెరాస ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని అనుమానిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులకు వల వేస్తుండవచ్చునని అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు శనివారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ అంశం పైన చర్చించారు.

ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి వ్యవహారం పైన కేంద్రం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు కావాలని గవర్నర్ నరసింహన్‌ను పీఎంవో, కేంద్ర హోంశాఖ కోరినట్లుగా తెలుస్తోంది.

 Telangana TDP leaders meet at NTR Bhavan

మత్తయ్య ఎక్కడ?

ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారని, ఈ వ్యవహారంలో ఏ 4 నిందితుడు అయిన మత్తయ్య ఎక్కడున్నారనే చర్చ సాగుతోంది. ఆయన చెప్పిన వ్యాఖ్యలు మీడియాలో వస్తుండటం గమనార్హం.

రేవంత్ అరెస్టు తర్వాత ఆయన మాట్లాడినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. రేవంత్ తనను చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లినట్లు, ఆయనే తనను స్టీపెన్ వద్దకు పంపినట్లు రాసివ్వాలని బెదిరిస్తున్నారని, తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని మత్తయ్య రెండు రోజుల క్రితం ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+