వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రాష్ట్రం: ఏవి మారుతాయి, ఏవి మారవు?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతదేశంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణ సోమవారంనాడు అవతరించింది. దీంతో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాడినవి కొన్ని మార్పులకు గురవుతాయి.

మార్పులు

పన్ను చెల్లింపు గుర్తింపు సంఖ్య (టిన్) మారుతుంది. తెలంగాణ వ్యాపారులు ముందు 36 చేర్చాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ 37 సంఖ్యను వాడుతుంది. వాణిజ్య పన్నుల చెల్లింపునకు టిన్ వాడుతారు.

Telangana: What will change and what won't?

తెలంగాణలోని లేబుల్స్, బోర్డులు మారుతాయి. తెలంగాణలోని పది జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానంలో తెలంగాణ ప్రభుత్వం వస్తుంది.

సచివాలయంలోని ఎ,బి,సి, డి బ్లాకులకు తెలంగాణ పేరు ఉంటుంది. హెచ్, జె, కె. ఎల్ బ్లాకులకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పేరు ఉంటుంది.

మద్యం బాటిల్స్‌పై లేబుల్స్ మారుతాయి. తెలంగాణలో విక్రయించే సీసాలకు గులాబీ రంగు ఉంటుంది.

రాష్ట్ర కోడ్, జిల్లా కోడ్‌లతో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు మారుతాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులను దాటే వాహనాల కదలికలను అంతర్రాష్ట్ర కదలికలుగా గుర్తిస్తారు. తెలంగాణలోని వాహనాలకు టిఎస్ ఉండాలనే డిమాండ్ వస్తోంది. దాన్ని కేంద్రం గుర్తించి, అనుమతించాల్సి ఉంటుంది.

తెలంగాణలో పది రోజుల పాటు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు ఉండవు. జిల్లా ఆర్టివో కోడ్స్‌కు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ రావాల్సి ఉంటుంది.

మార్పులు లేనివి

టెలికం సర్కిల్ ఒక్కటే కావడంతో కాలింగ్ రేట్లు మారే అవకాశం లేదు. మరో స్పేక్ట్రమ్ వేలం జరిగే వరకు అవి మారే అవకాశం లేదని అంటున్నారు. ఎస్టిడీ కోడ్స్ కూడా మారే అవకాశం లేదు.

పోస్టల్ కోడ్స్ కూడా మారే అవకాశం లేదు.

ఆధార్ కార్డులు కూడా మారవు

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇవ్వడంతో పాస్‌పోర్టులను కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఏవీ మార్పునకు గురి కావు.

English summary
As the new state is born on Monday, some things will change while others will remain as they are.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X