'చిరు తనయుడు చెర్రీ 'ఎవడు' సినిమాను అడ్డుకుంటాం'

మెదక్/హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేకి అయిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ ఎవడు సినిమాను మెదక్ జిల్లాలో ప్రదర్శించకుండా అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇతర నేతలు మెదక్ జిల్లాలో మాట్లాడారు. తెలంగాణ వ్యతిరేకులైన వారి సినిమాలను తెలంగాణ ప్రాంతంలో ఆడనీయబోమన్నారు.

గతంలో తెలంగాణవాదులు చిరంజీవి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తదితర హీరోల సినిమాలకు తెలంగాణ సెగ తగిలింది.

Telanganites warn they will obstruct Yevadu

కాగా, ఈ మధ్య కాలంలో ఏ పెద్ద హీరో సినిమానూ రామ్ చరణ్ తేజ ఎవడులా వాయిదాలుపడుతూ.. లేటవుతూ... రిలీజ్ కాలేదు. అయితే విషయం ఉంటే ఎన్ని అడ్డంకులు ఎలా వచ్చినా విజయం మన వెంటే ఉంటుంది. హాలీవుడ్ చిత్రం ఫేస్ ఆఫ్ లోని నావల్టీ పాయింట్‌ని తీసుకుని రెగ్యులర్ తెలుగు కథ, కథనంతో మసాలా దట్టించి చేసిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులుకు బాగానే పట్టే అవకాశం కనిపిస్తోంది.

ఈ చిత్రంలో నటీనటులు: రామ్ చరణ్, అల్లు అర్జున్, అమీ జాక్సన్, కాజల్, శృతి హాసన్, జయసుధ, కోటా శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, సాయి కుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, కథ సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్ : సెల్వం, ఆర్ట్: ఆనంద్ సాయి, సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+