‘రాబోయే రోజుల్లో చంద్రబాబుకు గుణపాఠం తప్పదు’
ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి జన్మభూమి కమిటీలా ఉందంటూ వైసీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆరోపించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి జన్మభూమి కమిటీలా ఉందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ఆరోపించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గిరిజనులను ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని, ఒక్క ఎస్టీ ఎమ్మెల్యేకు కూడా ఈ కమిటీలో స్థానం కల్పించలేదని ఆయన విమర్శించారు. నాడు వైయస్సార్ హయాంలో గిరిజన సలహా మండలి ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బాలరాజు ప్రస్తావించారు.

నాటి గిరిజన సలహా మండలిలో అన్ని పార్టీల నేతలకు స్థానం కల్పించారని బాలరాజు తెలిపారు. కానీ, చంద్రబాబు మాత్రం ఏకపక్షంగా గిరిజన సలహా మండలిని నియమించారని, గిరిజనులకు ఇచ్చేందుకు చంద్రబాబు వద్ద నిధులు మాత్రం ఉండవని ఆయన మండిపడ్డారు.
ఏజెన్సీలో ఇప్పటికీ కరెంటు, రోడ్డు సౌకర్యం లేని గ్రామాలున్నాయని బాలరాజు చెప్పారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు గుణపాఠం తప్పదని బాలరాజు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications